ఈ మధ్య కాలంలో సమంతకు పెద్ద ప్లాప్ ఇదే..!

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ రేంజ్లో దూసుకుపోతుంది మన అక్కినేని వారి కోడలు సమంత. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ.. నాగ చైతన్యతో పెళ్ళైన తరువాత తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ హిట్ల మీద హిట్లందుకుంటూ వచ్చింది. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి హిట్లతో మంచి ఫామ్లో ఉన్న సమంత నుండీ ఇటీవల వచ్చిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ లో త్రిష చేసిన పాత్రనే ఇక్కడ సమంత చేసింది. త్రిషకు ఏమాత్రం తగ్గకుండా సమంత ఈ పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. అయితే ఒరిజినల్ ను అందరూ చూసెయ్యడం వలనో ఏమో కానీ.. ‘జాను’ చిత్రానికి కలెక్షన్లు అస్సలు రావడం లేదు.

వీకెండ్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే రాబట్టినప్పటికీ.. సోమవారం నుండీ డ్రాప్ అయ్యాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సమంత సినిమాలకి అక్కడ మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ చిత్రం కూడా అక్కడ మంచి వసూళ్ళను రాబడుతుంది కదా అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. గత కొంత కాలంగా సమంత నటించిన సినిమాలు అన్నీ దాదాపు హాఫ్ మిలియన్ డాలర్లను వసూల్ చేసాయి. ఒక్క యూ టర్న్ పక్కన పెడితే అన్ని సినిమాల విషయంలో అదే జరిగింది. కానీ ‘జాను’ సినిమా కేవలం $173K డాలర్లను మాత్రమే వసూల్ చేసింది. దీంతో అక్కడ భారీ నష్టాలు తప్పేలా లేవనే చెప్పాలి. ’96’ చిత్రం చాలా వరకూ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉండడం వలనే.. ‘జాను’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video


పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus