కరోనా వైరస్ మరింత విజృంభిస్తున్న తరుణంలో థియేటర్లు అప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. అయితే.. రిలీజ్ పెండింగ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఓటిటి వైపు చూస్తున్నాయి. తెలుగులో దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. తమిళంలో మాత్రం దీనికి వ్యతిరేకత ఎదురవుతుంది. స్టార్ హీరో సూర్య ఇప్పటికే `పొన్‌మగల్ వందాల్` చిత్రం ద్వారా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చెయ్యడానికి సూర్య రెడీ అయినప్పటి నుండీ అక్కడి డిస్ట్రిబ్యూటర్ లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.అయినా సూర్య వెనకడుగు వేయలేదు.
ఈ సినిమాని ఇప్పుడు విడుదల కాకపోతే.. అప్పుల పాలైపోతాను. అవన్నీ మీరు తీరుస్తారా’ అంటూ వారికి సర్దిచెప్పాడు. ఇప్పుడు తన `ఆకాశమే నీ హద్దురా` చిత్రాన్ని కూడా ఓటిటిలోనే విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చాడు సూర్య. ఈ క్రమంలో సూర్య పై మరోసారి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిరసనకు దిగారు.ఏకంగా తమిళనాడు మంత్రి అయిన కడంబూర్ రాజు కూడా సూర్య నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీలో సూర్య వంటి పెద్ద హీరో సినిమా విడుదల చేయకూడదు.అలా చేస్తే.. థియేటర్ యాజమాన్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ విషయాలను సూర్య దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి దీని పై సూర్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!