బాబోయ్ ఇక‌ రాకీ భాయ్ ఫ్యాన్స్ ఆగ‌రేమో..?

దక్షిణాది నుంచి వస్తున్న మ‌రో భారీ పాన్ ఇండియన్ మూవీ కేజీఎఫ్ 2. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 అంచ‌నాల‌కు మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన సంగతి తెలిసిందే. విడుద‌ల అయిన అన్ని భాష‌ల్లో ఈ సినిమా స‌త్తా చాటింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, రాకింగ్ స్టార్ య‌ష్‌లు దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు. దీంతో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 పై భారీ అంచ‌నాలే పెర‌గ‌డంతో ఈసారి మరింత శ్ర‌ద్ధ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

లాక్‌డౌన్ కార‌ణం ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వ‌గా ఇటీవ‌లే పున:ప్రారంభించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొద‌లైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేజీఎఫ్ 2 నుండి ఒక్క బ‌ర్త్‌డే పోస్ట‌ర్ త‌ప్పా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. అస‌లే ఈ సినిమా కోసం ఇండియా వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. దీంతో కేజీఎఫ్ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రేక్ష‌కుల‌కు చిత్ర యూనిట్ బిగ్ అప్‌డేటే ఇచ్చింది.

కేజీఎఫ్ టీమ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన న్యూస్ ఏంటంటే ఆ సినిమా టీజ‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాడి జ‌న‌వ‌రి 8న య‌ష్ బ‌ర్త్‌డే కానుక‌గా కేజీఎఫ్ 2 టీజ‌ర్ విడుద‌ల చేసేందుకు ఆ మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో థియేట‌ర్‌లో రాకీభాయ్‌ను చూసేందుకు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉన్నా, యూట్యూబ్‌లో మాత్రం రాకీ ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ని తెలుస్తోంది.

ఇక క‌న్న‌డ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేజీఎఫ్ మొద‌టి భాగాన్ని 80 కోట్లతో తెరకెక్కించగా, కన్నడ, తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో విడుదలై, ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య ప‌రుస్తూ ఏకంగా 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేజీఎఫ్ రెండో భాగం మ‌రింత రిచ్‌గా వ‌చ్చేందుకు అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నార‌ని టాక్. మ‌రి కేజీఎఫ్ 2 నిర్మాత‌ల‌కు ఏ రేంజ్‌లో కాసుల పంట పండిస్తుందో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus