బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేది ప్రతివారం జరిగేవే. ఇందులో నామినేట్ అయిన ఇంటి సభ్యులు మళ్లీ ఆడియన్స్ ఓట్లు వేసి వారిని గెలిపిస్తే కానీ సేఫ్ అవ్వరు. అలాంటిది బిగ్ బాస్ ఈసారి 9వ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురుకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. వారిలో ఒకరు సేఫ్ అవ్వొచ్చు అని, ఇమ్యూనిటీ ఛాలెంజ్ టాస్క్ ఇచ్చాడు. కానీ హౌస్ మేట్స్ దాన్ని చెడగొట్టుకున్నారు. ‘టి’ స్టాండ్ లో ముఖం పెట్టి దాన్ని కాపాడుకుంటూ ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వారు విజేతగా నిలుస్తారని, వారికి ఈవారం పవర్ వచ్చి ఇమ్యూనిటీ దక్కి సేఫ్ అవుతారని బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు.
ఇక్కడే హౌస్ మేట్స్ ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఎవరికి ఇమ్యూనిటీ కావాలి అనే డిస్కషన్ కూడా పెట్టుకోలేదు. డైరెక్ట్ గా టాస్క్ లోకి వెళ్లిపోయారు. టాస్క్ లో మిగతా హౌస్ మేట్స్ వారిని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా మొండిగా అలాగే ఉన్నారా టాస్క్ బ్రహ్మాండంగా ఆడారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.
కానీ , ఎప్పుడైతే బిగ్ బాస్ ఎండ్ బజర్ మోగే లోపు ఎవరు ఉంటే వారికే ఇమ్యూనిటీ లేదంటే ఎవరికీ ఉండదు అని ఎనౌన్స్ చేశాడో అప్పుడు వాళ్లు మేలుకోవాల్సి ఉంది. ఒక్కరు కూడా వారి రిక్వస్ట్ ని ఎదుటివారికి చెప్పలేదు. అంతేకాదు, ఇంటి కెప్టెన్ గా అరియానా కూడా ఈ విషయాన్ని హౌస్ మేట్స్ తో చర్చించలేదు. ఎవరికి వారే పంతానికి పోయి పవర్ ని పోగొట్టుకున్నారు. ఇక ఈటాస్క్ ఆడేటపుడు కూడా లాస్ట్ వరకూ హౌస్ మేట్స్ మద్యన ఘర్షణ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ కూడా అరుచుకున్నారు. వాగ్వివాదం పెట్టుకున్నారు. మిగతా హౌస్ మేట్స్ కూడా మనకెందుకు వచ్చిన గొడవ అని అందులో ఇన్వాల్ అవ్వలేదు.
కష్టపడి ఆడి కూడా టాస్క్ లో ఇమ్యూనిటీని వేస్ట్ చేసేస్కున్నారు. అభిజిత్ ముందుగానే వదిలేస్తే, హారిక గేమ్ లో అవుట్ అయ్యింది. తర్వాత మిగిలింది ముగ్గురే ముగ్గురు కనీసం ఈ ముగ్గురు అయినా సరే ఒకరికొకరు మాట్లాడుకుని ఇమ్యూనిటీని దక్కించుకోవాల్సింది. కానీ అలా చేయలేదు. మరి దీనిపై నాగార్జున ఈ వీకెండ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.