తెలుగు ప్రేక్షకుల అత్యంత ఫేవరేట్ షో బిగ్ బాస్ సరికొత్తగా ముస్తాబై వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలుకానుంది. సెలెబ్రిటీల మధ్య సరదాలు, ఆటలు, రొమాన్స్, గిల్లికజ్జాలను చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేయడానికి షో సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున ఈ రియాలిటీ షో ప్రారంభించనున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే షో లేటు కావడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే ఆ సెలెబ్రిటీలు ఎవరు అనే ఆసక్తి మొదలైపోయింది. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ 4 లో పాల్గొనే సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్ బయటికి రావడం జరిగింది. వారిలో వెండితెర మరియు బుల్లితెరకు చెందిన క్రేజీ సెలెబ్రిటీలు ఉన్నారు. మరి బయటికి వచ్చిన ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే.
అభిజిత్, Tv9 దేవి, దివ్య, జబర్దస్త్ అవినాష్, సింగర్ నోయల్ సేన్, యాంకర్లు లాస్య, అరియానా, నటి సురేఖ, కరాటే కళ్యాణి, పూనమ్ బజ్వా, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మెహబూబ్ దిల్ సే, గంగవ్వ, మోనాల్, అమ్మ రాజశేఖర్, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ లు ఉన్నట్లు తెలుస్తుంది. ఐతే ఇది కేవలం అంచనా మాత్రమే. రేపు ఆదివారం ఎపిసోడ్ తో ఊహాగానాలన్నింటి తెరపడనుంది.