ఇంట్లో సీరియస్ నెస్ లేదని నాగార్జున అన్నాడో కానీ… ఈ రోజు మాంచి సీరియస్‌గా సాగింది. నామినేషన్ల సందర్భంగా అయితే ఇంట్లో మంటలు రేగేతంత కోపతాపాలు వచ్చాయి. ఈ రోజు ఇంకా ఏం జరిగిందంటే?
* హారిక – మోనాల్‌కు అభిజీత్ ఎంత క్లోజో మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఒకవేళ నిన్న బీకర్ వాటర్ టాస్క్‌లో ఎవరికి సపోర్టు చేస్తావని అభిజీత్‌ని దివి అడిగింది. దానికి అభిజీత్ తొలుత ఇద్దరి బీకర్లలో చెరి సగం పోస్తా అని చెప్పాడు. ఆ తర్వాత హారికకే సపోర్టు చేస్తా అని అన్నాడు.
* బీకర్ ఎలిమినేషన్ టాస్క్ సమయంలో మెహబూబ్ చెప్పిన రీజన్‌కు హారిక కన్విన్స్ అవ్వలేదు. సరైన రీజన్ లేకుండా నన్ను ఎలిమినేట్ చేయాలని చూశాడు. ఒక విధంగా నా ఈగోను టచ్ చేశాడని హారిక చెప్పింది.
* జోక్‌లు వేస్తూ.. జోక్‌గా ఉంటున్నాడు అంటూ అమ్మ రాజశేఖర్‌ను దేవీ జీరో చేసిన విషయం తెలిసిందే. దానిపై అమ్మ రాజశేఖర్, ఆరియానా మధ్య చర్చ జరిగింది. మీరు మళ్లీ ఫ్రెండ్స్ అవుతారని ఆరియానా అంటే, అస్సలు జరగదు. ఒకసారి విలన్ ఎప్పటికీ విలనే అని మాస్టర్ చెప్పాడు. అయితే గేమ్‌ని గేమ్‌గా చూడమని ఆరియానా సూచించింది.
* కొత్త రేషన్ మేనేజర్‌ను ఎంపిక చేయమని కెప్టెన్ నోయల్‌కు బిగ్‌బాస్ సూచించాడు. అభిజీత్‌ను కొత్త రేషన్ మేనేజర్‌గా యునానిమస్‌గా ఎంచుకున్నారు.
* ఇంట్లో తొలిసారి కుక్కలు అరిచాయి. అంటే ఎవరో పగటిపూట నిద్రపోయారని అర్థం. తీరా ఎవరా అని చూస్తే… అది కుమార్ సాయి. అమ్మ రాజశేఖర్, దివి మాట్లాడుకుంటుంటే పక్కనే కూర్చున్న కుమార్ సాయి అలా కునుకేసేశాడు.
* బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో మూడోవారం నామినేషన్ల ప్రక్రియలో ఏడుగురు నామినేట్ అయ్యారు. దేవీ ముందుగా కళ్యాణి చేతిలో నామినేట్ అవ్వగా, కెప్టెన్ హోదాలో నోయల్ లాస్యను నేరుగా నామినేట్ చేశాడు. వీరు కాకుండా ఆరియానా, మెహబూబ్, కుమార్‌సాయి, హారిక, మోనాల్ నామినేట్ అయ్యారు
Click Here -> నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే
‘బిగ్‌బాస్’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!