కెప్టెన్సీ పోటీలో పార్టిసిపెంట్స్‌గా నిలిచే టాస్క్ అనో లేక మొన్న నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడనో, లేక నామినేషన్ల కోపమో కానీ… ‘ఉక్కు హృదయం’ టాస్క్ ఫుల్ జోష్‌లో సాగింది. మధ్యలో అరుపులు, కేకలు, తిట్లు… ఇలా చాలా వచ్చాయి. అసలు మొత్తం టాస్క్‌లో మనుషుల టీమ్ చేసిందా తప్పా? లేక రోబోల టీమ్ తప్పు చేసిందా అనేది చూద్దాం….
‘ఉక్కు హృదయం’ టాస్క్ ప్రధాన ధ్యేయం… రెండు టీమ్‌ల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అవసరమైన సౌకర్యం పొందడం. అంటే రోబోలకు ఛార్జింగ్ అవసరమైతే మనుషుల దగ్గరకు వచ్చి అడగాలి. అప్పుడు మనుషులు ఇంట్లో ఉన్న ఏదైనా వసతిని కోరుతారు. దానికి ఒప్పుకుంటే రోబో ఛార్జ్ అవుతుంది. కానీ 17వ రోజు జరిగిన టాస్క్ పార్ట్ చూస్తే… ఆ పాయింట్ అందరూ మరచిపోయినట్లున్నారు ఒక్క ఆరియానా తప్ప. దివిని కిడ్నాప్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నారు. అయితే దానిని బిగ్‌బాస్ సపోర్టు చేస్తూ ఛార్జింగ్ పాయింట్ కూడా పెంచాడు.
‘వాష్ రూమ్ అవసరమైతే వాడుకోండి.. ఛార్జింగ్ అడగం’ అని అభిజీత్ వచ్చిన మనుషుల టీమ్‌ను అడిగాడు. దానికి ఒప్పుకున్న అఖిల్, మోనాల్, మెహబూబ్, నోయల్… తొలుత దివిని పంపించారు. ఆమె రిటర్న్ వచ్చినప్పుడు అమ్మాయిలందరూ ఆమెను పట్టేసి ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. తొలుత అభిజీత్ ఛార్జింగ్ పెట్టుకోగా, తర్వాత హారిక ఛార్జింగ్ పెట్టుకుంది. అయితే ఛార్జింగ్ అయ్యిందా లేదా అనేది తెలియలేదు. ఈ కిడ్నాప్ ఛార్జింగ్ ప్రక్రియ జరుగుతున్నంతసేపు బయట మనుషుల టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళన అనడం చాలా తక్కువే. అరుపులు, కేకలు, తిట్లు, వార్నింగ్ లాంటివి అయ్యాయి. సోహైల్ అయితే నువ్వు రేపు బయటకు వస్తావు కదా చూసుకుందాం అని కూడా అన్నాడు. ఈ లోగా దివికి ఫుడ్ పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో గంగవ్వ కీలకంగా వ్యవహరించింది.
బయట మనుషుల టీమ్ గోల చేస్తుండేసరికి అభిజీత్ వెళ్లి డోర్ తీశాడు. ఇంట్లోకి వచ్చిన మనుషుల టీమ్… గొడవకు వచ్చారు. అలా కిడ్నాప్ చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం లాంటివి సరికాదని మనుషుల టీమ్ అన్నారు. ఎవరు ఎంత అన్నా… ఈ కిడ్నాప్ ప్లాన్ చేసిన అభిజీత్ ఫుల్ క్లియర్‌గా ఉన్నాడు. ‘నేను తప్పు చేశాను’ అనిపిస్తే నన్ను నామినేట్ చేయండి. ప్రేక్షకులే నేను చేసింది తప్పో రైటో చెబుతారు అని అన్నాడు. నిజమే కదా… బిగ్‌బాసే ఏమీ అనలేదు. వీళ్లు ఏం అని ఎం లాభం. ఇదే కదా స్మార్ట్ గేమ్.
దివిని లోపలకు పంపించడం విషయంలో బయటక మనుషుల టీమ్‌లో పెద్ద చర్చే జరిగింది. సోహైల్ అయితే అరిచి ఆవేశపడ్డాడు. మాకు చెప్పకుండా ఆమెను లోపలకు ఎలా పంపించారు అంటూ కోపమయ్యాడు. మరోవైపు లోపల కూడా ఆరియానా ఇది కరెక్ట్ కాదు అంటూ రోబోల టీమ్‌కు చెప్పింది. దానికి ఆమెకు సరైన స్పందన రాలేదు. ఆ తర్వాత ఆరియానా ఇంటి నుంచి బయటకు వచ్చి నిద్రపోతున్న వాళ్ల దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ విఫలమైంది.
17 రోజు మొత్తం బిగ్‌బాస్ ఇదే టాస్క్ చూపించాడు. కమింగ్ అప్ చూస్తుంటే 18వ రోజు కూడా దీనిని కొనసాగించేలా కనిపిస్తోంది. ఇంకా ఈ టాస్క్ కొనసాగితే చిరాకు పుట్టే అవకాశమూ ఉంది. గేమ్‌లో బిగ్‌బాస్ క్లారిటీగా చెప్పినా… ఎవరూ సరిగ్గా పాటించడం లేదు. వైర్లు పీకేసి, రోబో ఛార్జింగ్ మీటర్ల పడేసి మనుషుల టీమ్ నిబంధనలు ఉల్లంఘించింది. మరోవైపు రోబోల టీమ్… రూల్స్ లేని విధంగా ఛార్జింగ్ పెట్టుకుంది. మొత్తం ఈ రోజు ఎపిసోడ్‌లో అభిజీత్ స్మార్ట్ గేమ్ ప్లాన్ ఒకటే గుర్తుంచుకోదగ్గ విషయం. అయితే ‘తనను ఎవరు తప్పుగా అనుకున్నా టీమ్ కోసం చేశా’ అంటూ అభిజీత్ ముందే క్లారిటీ ఇచ్చేశాడు.
చనిపోయిన రోబో దేవీ ఈ ‘కిడ్నాప్ ఛార్జింగ్’లో సపోర్టు చేసింది. ఆ తర్వాత అందరూ లోపలకు వచ్చినప్పుడు దూరంగా వెళ్లిపోయింది. రూల్స్ అని మాట్లాడే దేవీ ఇలా ఎందుకు చేసిందో. సోహైల్ నోరు అదుపులో పెట్టుకోకుండా.. ఉమ్మేయడం గమనార్హం. మెహబూబ్ కూడా అదే స్థాయిలో ఆవేశపడ్డాడు. నాగార్జున వీకెండ్‌లో ఈ విషయం గురించి అడుగుతారేమో చూడాలి. ఇవన్నీ పక్కనపెడితే ఫిజికల్ టాస్క్‌గా మొదలైన గేమ్… దారి తప్పి తిట్లు టాస్క్‌గా మారినట్లు కనిపిస్తోంది.