బిగ్ బాస్ 4: హౌస్ లో గొడవకి కారణం ఆమేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఓపిక టాస్క్ విధ్వసం సృష్టించింది. ఈ టాస్క్ లో ఫస్ట్ అరియానా ఛైర్ లో కూర్చుని ఉన్నపుడు సోహైల్ అండ్ మోనాల్ ఇద్దరూ కూడా రెచ్చిపోయారు. తనకిష్టమైన వస్తువులని స్విమ్మింగ్ పూల్ లో పారేశారు. చింటూ టెడ్డీ బేర్ ని పైకి విసిరేశారు. ఇక్కడే మోనాల్ అరియానాని నా విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోలేదు కదా అని అడిగింది. అంతేకాదు, సోహైల్ దగ్గర ఉన్న బొమ్మని పైకి విసిరేసింది. తర్వాత మోనాల్ ఓపిక ఛైర్ లో కూర్చున్నపుడు అరియానా ఇవే పాయింట్స్ రైజ్ చేసింది. దీంతో ఆన్సర్ చెప్పలేక మోనాల్ తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లి భోరున ఏడ్చింది.

తర్వాత సోహైల్ టర్న్ వచ్చినపుడు ఈ విషయాలపై క్లారిటీ ఇమ్మని అరియానా ప్రశ్నలు వేసింది. అక్కడే మోనాల్ వెక్కి వెక్కి ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా వచ్చేసింది అరియానా. హారికని పిలిచింది. బిగ్ బాస్ కి పరిస్థితి గురించి చెప్పి కన్ఫెషన్ రూమ్ కి పంపించింది.

టాస్క్ తర్వాత మోనాల్ విషయంలో సోహైల్ విషయం తెలుసుకుని అరియానాకి కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తను గేమ్ లో, టాస్క్ లో ఎంత క్రూయల్ గా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు. నువ్వు ఆడితే టాస్క్, మేము ఆడితే కాదా అంటూ మాట్లాడాడు అంతేకాదు చాలా సేపు ఇద్దరూ ఆర్గ్యూ చెసుకుని పెద్ద యుద్ధమే చేశారు.

ఇక ఈ హౌస్ లో గొడవ మొదలు అవ్వడానికి కారణం మోనాలేనా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఫస్ట్ లో మోనాల్ ఏడుపే ఆయుధంగా ఇన్ని వారాలు హౌస్ లో నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఇదే ఏడుపు తనకి మైనస్ కాబోతోందనే అంటున్నారు అందరూ. ఇక హౌస్ లో ఇంత కొడవకి కారణం తనే అని కూడా అంటున్నారు. ఈ మోనాల్ కి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదీ విషయం.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus