Bigg Boss 7 Telugu: 4వ వారం నామినేషన్స్ లో హైలెట్ ఇదేనా..! ఎవరు నామినేట్ అయ్యారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం నామినేషన్స్ లో హౌస్ వేడెక్కిపోయింది. ముఖ్యంగా రతిక ఇంకా శుభశ్రీ ఇద్దరికీ ఆర్గ్యూమెంట్ ఒక రేంజ్ లో అయ్యింది. నామినేషన్ ప్రక్రియలో ఇప్పటికే ఇమ్యూనిటీని సంపాదించిన సందీప్, శివాజీ, ఇంకా శోభాశెట్టి ఈ ముగ్గురూ కూడా జుడిషియల్ మెంబర్స్ గా కూర్చుని ఉంటారు. బోన్ లో ఒక పార్టిసిపెంట్ ని తీసుకుని మిగతా వాళ్లు నామినేషన్ పాయింట్స్ చెప్తారు. జుడిషియల్ లో ఉన్న ముగ్గురూ ఆ పాయింట్స్ కి ఏకీభవిస్తేనే హౌస్ మేట్ నామినేట్ అవుతాడు. లేదంటే సేఫ్ అవుతాడు. ఈప్రక్రియలో రతిక బోన్ లోకి వచ్చినపుడు శుభశ్రీ లాయర్ గా గొప్ప పాయింట్ లాగింది.

మాట్లాడితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ వేరేవాళ్లని సీన్ లోకి తీస్కుని వస్తావని, నా ఎక్స్ గుర్తుకు వచ్చాడని చెప్తున్నావని అది మంచి పద్దతి కాదని హౌస్ రూల్స్ ప్రకారం అవుట్ సైడర్స్ నేమ్ తీస్కుని రాకూడదని చెప్పింది. అలాగే, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇలా మాట్లాడితే బిగ్ బాస్ కూడా ఒప్పుకోకుూడదని మాట్లాడింది.

దీంతో రతిక ఒక్కసారి షాక్ అయ్యింది. ఈ పాయింట్ పై నామినేట్ చేస్తుందని అస్సలు ఊహించలేదు. అంతేకాదు, రతిక గేమ్ ప్లాన్ మొత్తం ఇట్లాగే తిరుగుతోందని బయట ఆడియన్స్ లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని శుభశ్రీ ధైర్యంగా బయటపెట్టేసింది. రతిక ఏం అనుకున్నా పర్లేదని ఆ పాయంట్ పైనే నామినేట్ చేసింది.

ఇక ఈవారం రతిక, టేస్టీ తేజ , గౌతమ్, ప్రిన్స్ యావార్, శుభశ్రీ వీళ్లు ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంక ఇంకా అమర్ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. మరి ఈసారి ఈ ఐదుగురు నామినేషన్స్ లోకి వస్తే మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus