Bigg Boss 5 Telugu: అయ్యో.. బిగ్ బాస్ షో రేటింగ్ అంత తక్కువా?

  • October 22, 2021 / 11:00 AM IST

బిగ్ బాస్ సీజన్ 1 బుల్లితెరపై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్1 ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎన్టీఆర్ వల్ల బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఐదుగురు లేడీ కంటెస్టెంట్లు ఒక మేల్ కంటెస్టెంట్ ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు హిట్ కాగా ఐదో సీజన్ మాత్రం గత సీజన్ల స్థాయిలో హిట్ కాలేదు.

వీకెండ్ లో రేటింగ్స్ పరవాలేదనిపించే స్థాయిలో ఉండగా వీక్ డేస్ లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రేటింగ్స్ రాలేదు. రాత్రి పది గంటలకు ప్రసారం అవుతుండటంతో షోను చూసే వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు ఈ షో విషయంలో ముఖం చాటేస్తున్నారు. గత వారం రేటింగ్స్ ను పరిశీలిస్తే వీక్ డేస్ లో ఈ షో రేటింగ్ కేవలం 2.69 కావడం గమనార్హం. వీకెండ్ లో మాత్రం బిగ్ బాస్ షోకు అర్బన్ ఏరియాలో 8.77 రేటింగ్ దక్కితే రూరల్ ప్రాంతంలో 5.70 రేటింగ్ దక్కింది.

ఈ రేటింగ్స్ నాగార్జున స్థాయికి తగిన రేటింగ్స్ కావనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రానురాను షోలో పస ఉండటం లేదని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విషయంలో షో నిర్వాహకులు పూర్తిస్థాయిలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ మిస్సైందని మంచి కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus