Bigg Boss 7 Telugu: పాపం పసివాళ్ళు అంటూ కంటెస్టెంట్లపై జాలి పడుతున్న నాగ్!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఏకంగా 6 సీజన్లను పూర్తి చేసుకొని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అప్డేట్స్ విడుదల చేశారు. ఇకపోతే తాజాగా నాగార్జున మరొక ప్రోమో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇందులో భాగంగా ఈయన ఈసారి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) కార్యక్రమం అందరూ ఊహించిన విధంగా ఉండదని సరికొత్త చాలెంజెస్ తో కొత్త రూల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఆరు సీజన్లను చూసాం అంతా మాకు తెలుసు అని కంటెస్టెంట్లు అనుకుంటే పొరపాటేనని,పాపం పసివాళ్లకు మన రూల్స్ తెలియవు అంటూ నాగార్జున చెప్పడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు పెరిగాయి. న్యూ రూల్స్, న్యూ చాలెంజస్, న్యూ బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ 7ఉల్టా పల్టా అంటూ నాగార్జున ఈ కార్యక్రమం గురించి తెలియజేయడంతో ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం మరింత కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది.

ప్రేక్షకులు కూడా ఇదే కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఆరు సీజన్లో మాదిరిగా ఈసారి కూడా పాత చింతకాయ పచ్చడిలా కాకుండా సరికొత్తగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలా ఈ ప్రోమో మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఈ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్ మూడవ తేదీ ప్రసారం కాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus