Pallavi Prashanth Arrested: సొంత ఇంట్లోనే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు!

తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆదివారం నాడు అంటే డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అమర్ దీప్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. అదే టైంలో చాలా అల్లర్లు కూడా జరిగాయి. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ కి స్వాగతం పలికేందుకు వచ్చిన అతని అభిమానుల అక్కడ అత్యుత్సాహంతో చేసిన రచ్చ వల్ల ఇదంతా జరిగింది.

ఈ క్రమంలో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా పల్లవి ప్రశాంత్ అభిమానుల పగలగొట్టడం జరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరోపక్క పల్లవి ప్రశాంత్… రోడ్డు పై ఊరేగింపులో కూడా పాల్గొని జూబ్లీహిల్స్ పోలీసులను చాలా ఇబ్బంది పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ కారణం పై కూడా అతని పై కేసు నమోదైంది. వీటిలో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా నిర్దారించారు అని తేలింది.

అతనితో పాటు ఇందులో ఉన్న వాళ్లలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా A1 గా ఉన్న పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. మొత్తానికి అతన్ని అలాగే అతని తమ్ముడు రవిరాజును గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గజ్వేల్ మండలం కొల్గూరులో పల్లవి ప్రశాంత్ సొంత ఇల్లు ఉంది. అక్కడే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్పష్టమవుతుంది. పల్లవి ప్రశాంత్ పై మొత్తంగా 9 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus