‘బిగ్ బాస్ 9’ సెప్టెంబర్ 7న గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. 9 మంది సెలబ్రిటీలు 6 మంది కామనర్స తో కలిపి మొత్తంగా 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి ఎందుకో టాస్కులు అంత ఇంట్రెస్టింగ్ గా లేవు అనే కామెంట్స్ మొదలయ్యాయి. అలాగే సెలబ్రిటీల లిస్ట్ కూడా చాలా డల్ గా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెయిన్ గా కామనర్స్ ఉన్నంత యాక్టివ్ గా సెలబ్రిటీలు ఉండటం లేదంటే కంప్లైంట్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది.
ముఖ్యంగా హౌస్ లో సెలబ్రిటీలు టాస్కుల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదు అనేది కూడా అందరూ ఎక్కువగా చెబుతున్న మాట. ఇదిలా ఉండగా.. హౌస్ మేట్స్ లో డల్ గా ఉన్న కంటెస్టెంట్ అంటే అంతా సుమన్ శెట్టి పేరు ఎక్కువగా చెప్పి అతన్ని నామినేట్ చేశారు. మరోపక్క సంజన గల్రాని పై కూడా ఎక్కువ నెగిటివిటీ ఉంది.
ఈ నేపథ్యంలో మొదటి వారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంతా అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సంజన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే ఓటింగ్ పరంగా వాళ్ళు ఇద్దరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది.
సంజన, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ వంటి వారు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ..లకి తక్కువ ఓట్లు పడ్డాయి అని సమాచారం. ఓటింగ్స్ లో వీళ్ళు వెనకబడటం వల్ల.. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుండి బయటకు వచ్చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.