Bigg Boss 7 Telugu: టాస్క్ లో బిగ్ బాస్ బిల్డప్..! పార్టిసిపెంట్స్ ఓవర్ యాక్షన్!

బిగ్ బాస్ హౌస్ లో కన్ఫార్మ్ కంటెస్టెంట్స్ అయ్యేందుకు హౌస్ మేట్స్ తెగ పోటీ పడుతున్నారు. దీనికోసం మాయాస్త్రం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టాడు. రణధీర – మహాబలి అనే టీమ్స్ ఛాలెంజస్ లో పాల్గొన్నారు. అయితే, ఇక్కడే ఛాలెంజస్ మరీ చిన్నపిల్లకి డిజైన్ చేసినట్లుగా చేశారు. పుల్ రాజా పుల్ అంటూ రోప్ టాస్క్ పెడితే, మలుపులో గెలుపు అంటూ బ్యాలన్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ రెండు ఛాలెంజస్ లో రణధీర టీమ్ గెలిచి రెండు తాళాలని సంపాదించింది. దీంతో మాయాస్త్రాన్ని పొందే అర్హత సాధించారని చెప్పి యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పాడు బిగ్ బాస్.

రణధీర టీమ్ మెంబర్స్ అందరూ లోపల సెట్ చూసి కేరింతలు కొట్టారు. స్మోక్ ఎఫెక్ట్, కలర్ ఫుల్ లైట్స్, స్పెషల్ వాయిస్ తో బిగ్ బాస్ అద్దరగొట్టేశాడు. తీరా చూస్తే మాయస్త్రం బదులుగా మాయాస్త్రం ఇదే అంటూ స్పిన్నర్స్ ని పంపించాడు బిగ్ బాస్. ఈ స్పిన్నర్స్ టీమ్ మెంబర్స్ అందూర మాయాస్త్రం పార్ట్స్ గా పంచుకున్నారు. ఇలా మాయాస్త్రం అంటూ చక్రాలు పంపిస్తావా అని బిగ్ బాస్ లవర్స్ ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ స్క్రిప్ట్ పరంగా ఓవర్ బిల్డప్ ఇచ్చి టాస్క్ తుస్ తుస్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. టాస్క్ స్టార్టింగ్ లో మాయాజీవులు మాయాస్త్రం కోసం పోటీ పడతారని, ఆకాశం నుంచీ పాతాళంలో ఆ అస్త్రం దాక్కుందని ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తూ వాయిస్ చదివారు. తీరా చూస్తే రెండు టీమ్స్ చిన్న పిల్లలు ఆడే టాస్క్ ఆడారని కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, ఈ టాస్క్ ఆడేటపుడు పార్టిసిపెంట్స్ కూడా కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. ప్రతి చిన్నదానికి అరుపులు కేకలతో ఎక్కువ చేశారు. రోప్ టాస్క్ లో గెలిచినపుడు, అలాగే బ్యాలన్స్ టాస్క్ లో గెలిచినపుడు కూడా ఒక రేంజ్ లో గొడవ చేశారు. శోభాశెట్టి, శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్, షకీల రణధీర టీమ్ మెంబర్స్ అందరూ రెచ్చిపోయి గోల చేశారు. కొసమెరుపు ఏంటంటే, టాస్క్ జరిగేటపుడు శుభశ్రీ వెళ్లి సందీప్ సంపాదించుకున్న పవర్ అస్త్రాన్ని దొంగతనం చేసింది. ఇది కూడా బిగ్ బాస్ సప్తసముద్రాలు దాటి పిల్లకాలవలో ఒకడు మునిగిపోయాడంట. ఆ ఒక్కరు ఎవరు అంటూ పజిల్ లా క్రియేట్ చేసి చమక్కులు విసిరాడు. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus