రేవ్ పార్టీలో బుక్కైన మాజీ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం..!

ఓ పక్క కరోనా విజృంభణ తగ్గకపోయినా…ఎంతో మంది మృత్యువాత పడుతున్నా… పార్టీలు, పబ్బులు.. అంటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ మాత్రం మాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అమ్మాయిలతో చిందులేస్తూ, డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇలాంటి బ్యాచ్ ఒకటి పోలీసులకు పట్టుబడింది. వారిలో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నలుగురు యువతులు ఉండటం గమనార్హం. తాజాగా నాసిక్‌లోని ఇగాత్‌పురిలోని విల్లాల్లో జరుగుతున్న ఓ రేవ్‌ పార్టీ గురించి పోలీసులకు సమాచారం వెళ్లడంతో వాళ్ళు రైడ్ చేశారు.

ఈ రైడ్ లో పట్టుబడ్డ వారిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఉండడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు సౌత్ కు చెందిన నలుగురు ఫిలిం ఆర్టిస్ట్ లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.మొత్తంగా ఈ రైడ్ లో 22 మంది యువతి, యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళు మద్యం మరియు డ్రగ్స్ మత్తులో చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారట. వీరి నుండీ భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు తెలిపారు.

ఇక రైడ్ లో పట్టుబడిన యువతీ యువకులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ కింద కేసు బుక్ చేశారట పోలీసులు. ఈ పార్టీకి హాజరైన యువతీ యువకుల ఖరీదైన కార్లను కూడా పోలీసులు స్వాధీన పరుచుకున్నారని తెలుస్తుంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus