Kiran Rathod: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ కిరణ్ రాథోడ్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ద్వారా తెలుగు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్. అయితే ఈమె ఇదివరకే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నువ్వులేక నేనులేను, జెమిని కెవ్వు కేక భాగ్యలక్ష్మి బంపర్ డ్రాప్స్ వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా నటిగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి కిరణ్ రాథోడ్ కి బిగ్ బాస్ అవకాశం కల్పించారు. అయితే ఈమె ఈ కార్యక్రమం మొదలైనటువంటి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇలా మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి కిరణ్ రాథోడ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతో మంది సెలెబ్రేటీలు క్యాస్టింగ్ కౌచ్ బాధితులని చెప్పాలి. ఈ క్రమంలోనే నేను కూడా అలాంటి బాధ్యతరాలిని అంటూ తాజాగా కిరణ్ రాథోడ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఏదైనా ఒక ప్రాజెక్టుకు కమిట్ అయ్యి ఆ ప్రాజెక్టుకు సంతకం పెట్టిన తర్వాత అసలు బుద్ధి బయటపడేది అంటూ ఈమె కామెంట్ చేశారు.

సంతకం పెట్టిన తర్వాత రాత్రికి వచ్చే అంటూ చాలా నీచంగా మాట్లాడే వారిని అయితే ఆ సమయంలో నాకు చేతిలో ఏ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ లేకపోయినా ఇలాంటి కమిట్మెంట్లకు తాను అసలు ఒప్పుకోలేదని ఈమె తెలియజేశారు. ఇలా అడగడంతో ఎన్నో ప్రాజెక్టులను కూడా వదులుకున్నానని ఈమె తెలియజేశారు ఇలాంటి కమిట్మెంట్లకు కాంప్రమైజ్ అవ్వడం కన్నా బయట ఏదైనా బిజినెస్ చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లడం మంచిది అంటూ ఈ సందర్భంగా ఈమె (Kiran Rathod) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus