మెహబూబ్ దిల్ సే తల్లి మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎమోషనల్ పోస్ట్..!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో మెహబూబ్‌ తల్లి మరణించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మెహబూబ్‌ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ”అమ్మా.. ఎందుకు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్‌. ఇక నుండి నేను ధైర్యంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ(అమ్మా)? నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.

నా ఒడిదుడుకుల్లో ఎల్లప్పుడూ నాకు తోడుగా అండగా ఉన్నావు. నా ఎదుగుదలను చూసి మురిసిపోయావు. మాకోసం సర్వస్వం త్యాగం చేశావ్‌. నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో కూడా అర్థం కావడం లేదు. ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మా..!. జీవితం అంటే ఏంటో నేర్పించింది నువ్వే. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని నాకు తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా. తమ్ముడిని, డాడీ ని బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను.

నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను” అంటూ మెహబూబ్‌ ఎమోషనల్‌ కామెంట్స్ చేసి తన తల్లి సమాధి వద్ద తీసుకున్న ఫోటోని షేర్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన మెహబూబ్, ‘బిగ్ బాస్ 4’ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అగ్రెసివ్ నెస్, హారికతో కలిసి చేసిన ‘టాప్ లేచిపోద్ది’ డ్యాన్స్ ఇతన్ని బాగా పాపులర్ చేశాయి. హౌస్ లో ఉన్నప్పుడు కూడా పలు సార్లు తన తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు మెహబూబ్.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus