నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో గతవారం ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ రోహిణి తాజాగా కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమాల్లోని నటీమణులకు కాదు.. సీరియల్లోని నటీమణులకు కూడా జరుగుతుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది రోహిణి. ఆమె చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు తెగ వైరలవుతున్నాయి.
రోహిణి మాట్లాడుతూ… “బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చిన నేను .. ఆ తరువాత ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాను. ఓ సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతలను వెళ్ళి కలిసినప్పుడు ఏకంగా నన్ను ఇద్దరు కమిట్మెంట్ అడిగారు. దీంతో అక్కడ నుండి వచ్చేశాను. ఆ తరువాత మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైంది. వయసులో చాలా పెద్ద వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు. అవకాశం ఇస్తా.. నాకేం ఇస్తావ్ అంటూ డైరెక్ట్ గా అడిగేవాడు. ఇలాంటి ఎన్నో అనుభవాల నుండీ బయటపడి.. నలుగురు మెచ్చుకునే స్థాయికి చేరుకున్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ రంగంలో ఉంటుంది.. కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.