పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సామ్రాట్ రెడ్డి అందరికీ సుపరిచితమే. 2018 లో ‘బిగ్ బాస్2’ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యాడు. ఆ షోలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. సామ్రాట్ మాత్రం చివరి వరకూ ఎంతో కూల్ గా గేమ్ ఆడాడు. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకూడదు అనే ఇతని స్వభావం.. అందరికీ నచ్చింది. అంతేకాకుండా ఇతనికి మంచి మార్కులు పడేలా చేసింది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే..
తాజాగా సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. గతంలో కూడా ఇతనికి పెళ్లయ్యింది. కానీ మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతం గతః అన్నట్టు.. దానిని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు సామ్రాట్. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎటువంటి హడావిడి లేకుండా కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా సామ్రాట్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన ‘బిగ్ బాస్’ అభిమానులు కూడా సామ్రాట్ కు ‘ఆల్ ది బెస్ట్’ ‘కన్గ్రాట్యులేషన్స్’ ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక .. ‘పంచాక్షరి’ ‘అహనా పెళ్ళంట’ ‘దేనికైనా రెడీ’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ వంటి చిత్రాల్లో సామ్రాట్ నటించాడు.