‘బిగ్ బాస్’ విన్నర్ కు దక్కనిది.. ‘బిగ్ బాస్’ అల్లుడికి దక్కింది

అదేంటో ‘బిగ్ బాస్’ విన్నర్ కు కూడా దక్కనిది ‘బిగ్ బాస్’ అల్లుడికి దక్కింది. ఎవరి గురించి చెప్తున్నానో ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది కదా..! యెస్.. నూతన్ నాయుడు గురించే..! ‘బిగ్ బాస్2′ లో ఓ కామన్ మెన్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు.. చాలా అదృష్టవంతుడు అనే చెప్పాలి.’కుటుంబం గురించి మాట్లాడకు నువ్వు’ అంటూ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యిపోయాడు. 2 వారాలకే ఎలిమినేటి అయిపోయినప్పటికీ .. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

మధ్యలో గాయపడినా కూడా మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సీజన్ విన్నర్ కౌశల్ క్రేజ్ ను అడ్డం పెట్టుకోవడం వల్లే నూతన కు అదంతా ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు. నిజానికి కౌశల్ కూడా తన ఆర్మీని.. నూతన నాయుడు వాడుకున్నంతలా వాడుకోలేదేమో అని అనిపించక మానదు. నూతన్ నాయుడులో ఓ రైటర్ కూడా ఉన్నాడు అని హోస్ట్ నాని కూడా కామెంట్ చేసాడు. అందరూ ‘బిగ్ బాస్2’ ముగిసిన తరువాత కౌశల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే..

విచిత్రంగా నూతన్ నాయుడు ఎంట్రీ ఇచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎఫ్2’ చిత్రంలో నూతన్ నాయుడు ఓ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ కూడా కాబోతున్నాడని సమాచారం. ‘ప‌రాన్న‌జీవి’ అనే చిత్రాన్ని నూత‌న్ నాయుడు డైరెక్ట్ చెయ్యబోతున్నాడట. రాంగోపాల్ వర్మ పై సెటైరికల్ గా ఈ చిత్రం రూపొందుతుందని సమాచారం. కొందరు పవన్ ఫ్యాన్స్ నిర్మాతలుగా మారి నూతన్ నాయుడు దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus