తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అంటూ కూడా వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటూ పెద్ద ఎత్తున ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ కూడా వేస్తున్నారు. ఇకపోతే గతంతో పోలిస్తే ఈసారి కాస్త ఓటింగ్ శాతం తగ్గిందనే తెలుస్తుంది.
ఏకంగా నాలుగు రోజులు పాటు హాలిడే రావడంతో చాలా మంది వెకేషన్ కి వెళ్ళిపోయారు అంతేకాకుండా వర్షం కారణంగా కూడా మరి కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాలలో కేవలం 10 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది
ఇదిలా ఉండగా (Bigg Boss) బిగ్ బాస్ హౌస్ లో కూడా తెలంగాణకు చెందినటువంటి కంటెస్టెంట్ లో ఉన్నారు మరి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారా ఒకవేళ వినియోగించుకొని ఉంటే ఎలా ఓటు వేశారు అన్న విషయాలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుస్తుంది.
సాధారణంగా ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు బ్యాలెట్ పోస్టు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా తమ ఓటును అలాగే వేశారని తెలుస్తోంది. ఇలా ఎంతో విజయవంతంగా పూర్తి అయినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు మూడో తేదీ రాబోతున్నాయి మరి మూడో తేదీ ఏ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందో తెలియాలి.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!