Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా.. ఏమైందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 లో 5 మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ కంటెస్టెంట్లలో అర్జున్ అంబటి మినహా మిగతా కంటెస్టెంట్లు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ అదిరిపోయే శుభవార్త చెప్పారని అందుకే ఈ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం అందుతోంది. మొదటి 5 వారాలు ఈ కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోకు దూరంగా ఉన్నా ఆ 5 వారాలకు సంబంధించిన రెమ్యునరేషన్ ఈ కంటెస్టెంట్లకు అందిందని సమాచారం.

భోలే షావళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. భోలే షావళి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలను ఇస్తూ బిగ్ బాస్ షోకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోల్చి చూస్తే రేటింగ్స్ కూడా మెరుగ్గా ఉన్నాయి. నాగార్జున కూడా ఈ షోకు హోస్ట్ గా ఆకట్టుకుంటున్నారు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 7 Telugu) నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ షో కోసం ఒకింత భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. బిగ్ బాస్ షో సీజన్8కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమైతే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అన్ స్టాపబుల్3 చివరి సీజన్ కావడంతో బాలయ్య కూడా ఇతర షోలపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తే ఈ షో రేటింగ్స్ మరింత పెరుగుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus