అఖిల్ ను కుక్కతో పోల్చిన గర్ల్ ఫ్రెండ్!

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అఖిల్ సార్థక్ గురించి అప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తన ఆటతో జనాలకు దగ్గరవుతున్నాడు. మొదటి వారంలోనే అఖిల్, మోనాల్, అభిజిత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలైందనే అభిప్రాయాలు వినిపించాయి. కొన్నాళ్లకు అభిజిత్ దూరంగా వెళ్లినా.. అఖిల్, మోనాల్ మాత్రం సన్నిహితంగానే ఉంటున్నారు. తనకు మోనాల్ కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని అఖిల్ చెప్పాలనుకుంటున్నా.. వీరిద్దరి రిలేషన్షిప్ పై రకరకాల మీమ్స్ వస్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. అఖిల్ రియల్ లైఫ్ లో ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరికీ బ్రేకప్ అయిందని.. ఆ విశేషాలను చెప్పుకొచ్చింది గంగవ్వ. హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన గంగవ్వ గతవారం బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ క్రమంలో అఖిల్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. అఖిల్ ఓ అమ్మాయిని నాలుగేళ్లు ప్రేమించాడని.. ఇద్దరూ కలిసి షికార్లు కూడా చేశాడని.. పెళ్లి చేసుకుందామనుకున్నారని చెప్పింది.

కానీ ఓ రోజు ఆ అమ్మాయి కుక్కని వంక పెట్టుకొని.. ఈ కుక్క ఎన్ని సార్లు వద్దన్నా తననే చూస్తుందని అందట. దీంతో అఖిల్ ఆమెకి దూరమైనట్లు గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ స్వయంగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఈ క్లిప్పింగ్ ని అన్‌సీన్ వీడియోలో చూపించారు. మూడేళ్ల క్రితం తన జీవితంలో దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పాడు అఖిల్. నాన్నకు గుండెపోటు, తన బ్రేకప్, కెరీర్ ఆగిపోవడం అన్నీ ఒకేసారి జరిగాయని.. తట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు అఖిల్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus