బిగ్ బాస్ నటి పై దాడి.. ఏమైందంటే..!

ప్రముఖ నటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన అర్చన పై ఘోరమైన దాడి జరిగిండి. ఆమె తెలుగు నటి అర్చన కాదు హిందీ బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అర్చన గౌతమ్. మాజీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి, నటి అయిన అర్చన గౌతమ్ 29 సెప్టెంబర్ 2023న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏ ఐ సి సి) ఆఫీస్ కి వెళ్లారు. ఆమె తండ్రితో కలిసి ఆమె లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న టైంలో కొందరు మహిళలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు, జుట్టు లాగి మరీ ఆమెను తోసేస్తూ దాడి చేశారు.

రిజర్వేషన్ బిల్లుపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంక గాంధీని అభినందించేందుకు వెళ్లిన అర్చన పై ఇలా దాడి జరిగినట్టు తెలుస్తుంది. అర్చన అలాగే ఆమె తండ్రి ఇంత అవమానపడినప్పటికీ కూడా వారు లోపలి వెళ్లలేకపోయారు. ‘ఇప్పటితో అయిపోలేదు. నేను ఇంకా పోరాడతాను. ఇలా నిశ్శబ్దంగా కూర్చోవడం లేదు, నాకు ఏది జరిగినా అది చాలా తప్పు’ అంటూ ఆమె చెప్పి వెళ్ళిపోయింది.మరోపక్క అర్చన గౌతమ్, అలాగే ఆమె తండ్రిపై మీరట్ లో కేసు నమోదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

మార్చి నెలలో కూడా వీరి పై కేసు నమోదైంది. ఇక (Archana) అర్చన గౌతమ్ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హసీనా పార్కర్’ ‘భరత్ కంపెనీ’ ‘జంక్షన్ వారణాసి’ ‘ఓ మై ఘోస్ట్’ వంటి సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది. అలాగే ‘బిగ్ బాస్ 16 ‘ తో పాటు పలు టీవీ షోలతో కూడా పాపులారిటీని సంపాదించుకుంది

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus