Arohi Rao: బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావ్ షాకింగ్ కామెంట్స్!

‘బిగ్ బాస్ 6 ‘ కంటెస్టెంట్ ఆరోహి రావ్ అందరికీ సుపరిచితమే. తెలంగాణ యాసలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూ బోలెడంతమంది ఫ్యాన్స్ ను పొందింది ఈ అమ్మడు. టీవీ 9 వంటి న్యూస్ ఛానల్స్ లో పని చేయడమే కాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ఓ విషయంలో దారుణంగా మోసపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆరోహి రావు చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. “4 రోజుల క్రితం ఓ ఆర్డర్ వచ్చింది.

ఫ్లిప్ కార్ట్, మీ షో రెండింటిలో ఆర్డర్ పెట్టి ఉండుంటాను అనుకుని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత నేను ఫోన్ చేసుకుంటే నేను రెండింటిలోనూ ఆర్డర్ పెట్టలేదు అని తెలిసొచ్చింది. డౌట్ వచ్చి.. ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ బాయ్ కి కాల్ చేసి ఎక్కడి నుండి డెలివరీ వచ్చిందని అడిగితే.. మీషో అని నాతో చెప్పాడు.దీంతో నేను మీషో యాప్ హెల్ప్ సెంటర్‌కు కాల్ చేసి..’నాకు ఇలా పెట్టని ఆర్డర్ వచ్చింది,

నా డబ్బులు నాకు రిఫండ్ చేస్తారా అని అడిగా. 72 గంటల్లో మీ టికెట్ రేజ్ చేశాం. మెయిల్ వస్తుందని అన్నారు. నాలుగు రోజులైంది ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నాకు ఆ ఆర్డర్లో కేవలం ఓ క్లాత్ ముక్క మాత్రమే వచ్చింది. ఇది ‘మీషో’ వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్.నాలాగే మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆర్డర్స్ వస్తే జాగ్రత్త వహించండి. మీ షో, ఇతర కంపెనీల నుండి కూడా అనేక మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు నాకు చెప్పారు” అంటూ ఆరోహి రావ్ (Arohi Rao) చెప్పుకొచ్చింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus