Himaja: అరెస్టు వార్తలపై వీడియో విడుదల చేసిన హిమాజా!

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన షో బిగ్ బాస్ షో..ఇప్పటికి తెలుగులో సక్సెస్ పుల్ గా 7వ సీజన్ నడుస్తోంది. మొదటి రెండు షోలకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా నిర్వహించగా తరువాత 5 సీజన్స్ కింగ్ నాగార్జున సక్సెస్ పుల్ గా నడిపిస్తున్నాడు. అయితే ఎంతో మంది ఆ షో ద్వారా పాపులారీటి సొంతం చేసుకున్నారు వారి హిమజ ఒకరు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్.. బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే తెలుగు ప్రేక్షకులకు హిమజ గురించి ఎక్కువగా తెలిసింది. అంతకు ముందు కూడా తను బుల్లితెర మీద, సినిమాల్లో మెరిసినప్పటికీ.. తనను అంతగా తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు.

అడపాదడపా సినిమాల్లో నటించిన హిమజ.. కొన్ని సీరియళ్లలోనూ నటించింది. తర్వాత బుల్లి తెర మీద అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో మెరిసింది. కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడే తనకు ఫుల్లు క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తను ఇండస్ట్రీలో ఫుల్లు బిజీ అయిపోయింది. చేతినిండా అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో నిత్యం ఏదో రకంగా హిమాజ వార్తలల్లో నిలుస్తొంది. సోంత ఇల్లు కొన్న హిమాజ ఫ్రెండ్స్ రేవ్ పార్టీ ఇచ్చిందని అది పోలీసులకు తెలిసి వారి అరెస్టు చేశారని వార్తలు చక్కెర్లు కొట్టింది.

అయితే ఆ వార్తపై హిమాజ ఓ వీడియో విడుదల చేసింది. అందులో నేను దీపావళి పండుగ కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటున్నాను. కొన్ని ఛానల్స్, కొన్ని ఫేక్ యాప్ లు నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. అటువంటి వార్తలు నమ్మద్దు. మా ఇంటి లో పార్టీ జరిగిన మాట వాస్తవమే..ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారానికి పోలీసులు కూడా వచ్చి మాఇంటిని చోద చేశారు..నేను కూడా ఎంక్వైరీ సహాకరించాను. ఈ వార్తలపై మా ఫ్రెండ్స్, బంధువులు చెప్పే వరకు నాకు తెలియదని హిమాజ ఓ వీడియో విడుదల చేసింది.. ఆ విడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus