Mehaboob: వామ్మో.. బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కొన్న కారు ఖరీదు అన్ని రూ.లక్షలా?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో మెహబూబ్ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా మెహబూబ్ తన క్రేజ్, పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారు. యూట్యూబ్ ద్వారా, పలు టీవీ షోల ద్వారా మెహబూబ్ కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ మెహబూబ్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మహీంద్రా ఎక్స్.యూవీ కారును మెహబూబ్ కొనుగోలు చేశారు.

బ్లాక్ కలర్ కారు ముందు మెహబూబ్ (Mehaboob) దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మెహబూబ్ కొనుగోలు చేసిన కారు విలువ 15 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈద్ పండుగ సందర్భంగా మెహబూబ్ కొత్త కారును కొనుగోలు చేసినట్టు బోగట్టా. మెహబూబ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేయగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు సైతం మెహబూబ్ కు కొత్త కారు కొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రంజాన్ మాసం సందర్భంగా మెహబూబ్ తన ఫ్రెండ్స్ కు ఇఫ్తార్ పార్టీ కూడా ఇచ్చారు. మెహబూబ్ కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెహబూబ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని తెలుస్తోంది. మెహబూబ్ యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ లతో ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. మెహబూబ్ కు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో మెహబూబ్ ఈ స్థాయికి చేరుకున్నారు. రాబోయే రోజుల్లో మెహబూబ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. శ్రీసత్యతో కలిసి మెహబూబ్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఈ జోడీ ప్రేక్షకుల్లో పాపులారిటీని పెంచుకుంటోంది. మెహబూబ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన స్థాయిని మరింత పెంచుకుంటారేమో చూడాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus