Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

శోభా శెట్టి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ‘కార్తీక దీపం’ సీరియల్లో విలన్ మోనిత పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ కి ఆమె పాత్ర చాలా కీలకం.కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమెను ఓన్ చేసుకోవడానికి కారణం మౌనిత పాత్రే అని చెప్పాలి.దాని వల్లే ఈమెకు ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది. దాని వల్ల ఈమె ఇంకా పాపులర్ అయ్యింది.

Shobha Shetty

అటు తర్వాత కన్నడ బిగ్ బాస్ కి కూడా ఈమె ఎంట్రీ ఇచ్చింది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేస్తే… ‘కార్తీక దీపం’ లో డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్ర చేసిన నటుడు యశ్వంత్ తో చాలా కాలంగా డేటింగ్లో ఉంది శోభా శెట్టి. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రివీల్ చేసింది. కానీ తర్వాత వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువ వార్తలు రాకపోవడంతో వీళ్ళు బ్రేకప్ అయ్యారేమో అని అంతా అనుకున్నారు.

కానీ ఎప్పటికప్పుడు వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసి ఆ కామెంట్స్ కి బ్రేకులు వేస్తూనే ఉన్నారు. ఇటీవల కలిసి దీపావళి జరుపుకున్న ఫోటోలు కూడా షేర్ చేశారు. ఇదిలా ఉండగా..సడన్ గా వీళ్ళ పెళ్లి వీడియో ఒకటి వైరల్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సైలెంట్ గా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటూ టాక్ మొదలైపోయింది. పెళ్లి బట్టల్లో ఈ జంట చాలా ముచ్చటగా ఉంది.

తలంబ్రాలు వేసుకుంటున్నట్లు కూడా ఆ ఫోటోలు ఉన్నాయి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు. షూటింగ్లో భాగంగా తీసింది. ఓ క్లాతింగ్ అండ్ జ్యుయలరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన సెట్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నట్టు నటించారు అంతే. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus