Siri Hanumanthu: షారూఖ్ తో కలిసి నటించిన బిగ్ బాస్ బ్యూటీ!

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా జవాన్ ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. క్రేజీ డైరెక్టర్ అట్లీ చాలాకాలం తర్వాత అలాంటి లుక్స్ లో చూపించి మెప్పించాడు. ఓ కంటెంట్ ఉన్న సినిమాను తెచ్చి షారూఖ్ ఖాన్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ సక్సెస్ వేశారు.

పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రంలో దాదాపు అందరూ బాలీవుడ్ – కోలీవుడ్ నటీనటులే ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ లేరని ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ మెంట్ అయ్యారు. సినిమా చూసిన తెలుగు జనాలకు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు అట్లీ. ఈ సినిమాలో మన అచ్చ తెలుగు బ్యూటీ కూడా ఉంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్ సిరి హనుమంత్. బిగ్ బాస్ లో ప్రధాన ఆకర్షణగా తన గ్లామర్తో ప్రేక్షకులను అలరించిన సిరి హనుమంత్..

తన ఫ్రెండ్ షణ్ముఖతో కలిసి ఎలా ప్రేమాయణం కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత బిగ్ బాస్ కెళ్లి మరీ ఎలాంటి రచ్చ చేసిందో అందరం చూసాం. అమ్మడి అదృష్టం బాగుంది బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల కొన్ని సినిమాల్లో మెరిసిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాలో కూడా సిరి క్యారెక్టర్ పెద్దగా ఉండదు. బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ పక్కన నటించడం అంటే నిజంగా పెట్టి పుట్టాల్సిందే.

అలాంటి అదృష్టం సిరి హనుమంతుకు (Siri Hanumanthu) దక్కింది. ఈ సినిమాలో షారుఖ్ పక్కన సబర్డినేట్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆయనలాంటి హీరోతో ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలా ఫేమస్ అయిపోతారు. సిరీకి ఆ సినిమాలో ఒక్క డైలాగ్ లేదు కానీ స్క్రీన్ స్పేస్ మాత్రం బాగానే ఉంది. దీంతో సిరి హనుమంతుని లక్కీ బ్యూటీ అంటూ అందరూ పొగిడేస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus