Sivaji: అయోధ్య రామ మందిరం పై శివాజీ షాకింగ్ కామెంట్స్!

జనవరి 22వ తేదీ అయోధ్య రామ మందిరంలో రాముల వారి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల హిందువుల కల అయినటువంటి రామ మందిరం ఏర్పాట్లకు అన్ని పూర్తి అయ్యాయి. ఈ నెల 22వ తేదీ ఎంతోమంది అతిరథ మహారధుల సమక్షంలో ఈ ఆలయం ప్రారంభం కాబోతోంది. అయితే మరికొందరు మాత్రం అయోధ్య రామ మందిరం అనేది తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే దేశవ్యాప్తంగా రామ మందిరాన్ని భారీగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి బిగ్ బాస్ నటుడు శివాజీ కూడా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయోధ్య రామ మందిరం గురించి శివాజీ మాట్లాడుతూ అయోధ్యలో ఉన్నదే రామ మందిరమా మా ఊర్లో కూడా రామ మందిరం ఉందని భారతీయ జీవన విధానమే రామ తత్త్వం. ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం ఇలాంటి విషయాలు వాడుకుంటాయి. ఇక మనుషుల కంటే ప్రకృతి చాలా గొప్పదని ఈయన తెలియజేశారు మనుషులు చేసే తప్పులను ప్రకృతి సరిదిద్దుతుందని శివాజీ తెలిపారు.

మనుషుల వల్ల చేతకాని మార్పు ప్రకృతి తీసుకువస్తుందని, కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడి చచ్చారు. కరోనా కంటే దారుణమైనవి వస్తాయి. ఎందుకంటే మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోయింది. డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. అలాంటి సమయంలో దేవుడే వచ్చి అన్ని సరిదిద్దుపోతారు అంటూ ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం గురించి నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ (Sivaji) చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus