Swetha Varma: నెటిజన్ పై ఫైర్ అయిన బిగ్ బాస్ శ్వేతావర్మ.. అలా కామెంట్స్ చేయడంతో?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా శ్వేతావర్మ (Swetha Varma) ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో సైతం శ్వేతావర్మ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల కంటే బిగ్ బాస్5 ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షో తర్వాత కెరీర్ పరంగా బిజీ అవుతూ క్రేజ్ పెంచుకుంటున్నారు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిన శ్వేతావర్మ గత కొన్ని నెలలుగా సినిమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమెకు తాజాగా షాక్ తగిలింది. ఒక వ్యక్తి ఆమె శరీర భాగాల గురించి అసభ్యంగా సందేశాలు పంపడంతో ఆమె ఫైర్ అయ్యారు. ఆ వ్యక్తి పంపిన మెసేజ్ లతో పాటు అతని ప్రొఫైల్ ను స్క్రీన్ షాట్ తీసి ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక మనిషికి ఇలా మాట్లాడాలని ఎలా అనిపిస్తుందని శ్వేతావర్మ అన్నారు. అతని అమ్మకు కూడా ఇలా ఎవరైనా చెబితే ఊరుకుంటాడా అని ఆమె ప్రశ్నించారు.

ఇప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు నేను సిగ్గు పడుతున్నానని శ్వేతావర్మ పేర్కొన్నారు. అతని, కాంటాక్ట్ వివరాలు సంపాదించానని ఆ వివరాలను సైతం ఇన్ స్టాగ్రామ్ లో పెట్టొచ్చని ఆమె తెలిపారు. కానీ నేను మనిషిని కాబట్టి ఆ వివరాలను షేర్ చేయలేకపోతున్నానని శ్వేతావర్మ వెల్లడించారు. ఇది అతనికి గుణపాఠమని ఇకనైనా నీచమైన పనులు చేయకుండా ఉండాలని ఆమె పేర్కొన్నారు.

శ్వేతావర్మకు నెటిజన్లు సైతం తమ మద్దతు తెలియజేస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే తర్వాత రోజుల్లో ఇబ్బందులు తప్పవని శ్వేతావర్మ సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే శ్వేతావర్మ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన గురించి తప్పుగా కామెంట్లు చేసిన వ్యక్తికి శ్వేతావర్మ సరిగ్గా బుద్ధి చెప్పారని నెటిజన్లు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus