Bigg Boss Voting: మొదటిరోజు ఓటింగ్ మీటర్ ఏం చెప్తోంది ? టాప్ లో ఉన్నది ఎవరంటే.?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో విన్నర్ ని డిసైడ్ చేసే సమయం వచ్చేసింది. దీనికోసం మొత్తం ఇప్పుడు ఏడుగురు పోటీ పడుతున్నారు. ఇందులో గత రెండు మూడు వారాలుగా, బిందు మాధవి, అఖిల్ ఇద్దరూ పోటీపోటీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఫైనల్స్ కాబట్టి, ఖచ్చితంగా సోషల్ మీడియాలో వార్ ఉంటుంది. ప్రస్తుతం అందరూ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూసే విన్నర్ ని డిసైడ్ అవుతున్నారు. కానీ, హాట్ స్టార్ అఫీషియల్ ఓటింగ్ లెక్కలు ఖచ్చితంగా తేడా ఉంటాయి.

వాటిని బిగ్ బాస్ మేనేజ్మెంట్ బయటకి చూపించదు. అంతేకాదు, ఎలిమినేషన్ తర్వాత కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా ఎక్కడా లీక్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్, యూట్యూబ్ పోలింగ్స్ చూసిన తర్వాత ఎవరెవరు ఏయే పొజీషన్స్ లో ఉన్నారంటే., వెబ్ సైట్స్ పోలింగ్ సైట్స్ ని చూసినట్లయితే, అఖిల్ సార్ధక్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపుగా 45శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేశాడు. బిందు మాధవి సెకండ్ పొజీషన్ లో ఉంది. 38 శాతం వరకూ ఓటింగ్ ని సొంతం చేసుకుంది.

కానీ, యూట్యూబ్ పోలింగ్స్ లో చూస్తే బిందు మాధవి టాప్ పొజీషన్ లో ఉంది. దాదాపుగా 50శాతం పైనే ఓటింగ్ ని ప్రభావితం చేసింది. అఖిల్ సార్ధక్ మాత్రం 30శాతం వరకూ మాత్రమే ప్రబావితం చేయగలిగాడు. దీన్ని బట్టీ చూస్తుంటే వీళ్లిద్దరిలో విన్నర్ ని డిసైడ్ చేయడం కష్టంగానే ఉంది. ఇక తర్వాత స్థానాల్లో యాంకర్ శివ, అరియానా గ్లోరీ, మిత్రాశర్మా, బాబాభాస్కర్, ఇంకా అనిల్ లు ఉన్నారు. వీళ్లలో టైటిల్ రేస్ లో ఒక్కరూ కూడా లేరు. మొదటిరోజు ఓటింగ్ చూసినట్లయితే, ప్రస్తుతానికి అఖిల్ ఇంకా బిందుల మద్యనే గట్టి పోటీ నడుస్తోంది.

యూట్యూబ్ వ్యూవర్స్ బిగ్ బాస్ కి ఎక్కువగా ఉంటారు కాబట్టి, యూట్యూబ్ లో పెట్టే పోలింగ్స్ ప్రకారం చూస్తే బిందు మాధవి ఈసారి టైటిల్ ఎగరేసుకుపోయేలాగానే కనిపిస్తోంది. అంతేకాదు, బిందు మాధవి టైటిల్ గెలిస్తే ఫస్ట్ టైమ్ తెలుగు సీజన్ లో ఒక లేడీ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతవరకూ ఎప్పుడూ కూడా లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూడలేదు. ఇంత దగ్గరగా వచ్చి ఈసారి ట్రోఫీ గెలవకపోతే వచ్చే సీజన్స్ లో కష్టమే అని చెప్పాలి. మరి అఖిల్, బిందు ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus