Pooja Murthy: బిగ్ బాస్ అమర్ దీప్ గురించి పూజా మూర్తి షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ 8వ వారం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికి ఏడు వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నుంచి ఏడుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఇక ఏడవ వారంలో భాగంగా ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ఐదవ వారం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఈ విధంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి రెండవ వారమే పూజా మూర్తి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా ఎలిమినేట్ అయినటువంటి ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీ గురించి ప్రశ్న ఎదురు కావడంతో శివాజీ హౌస్ లో ఉంటూ పల్లవి ప్రశాంత్ అలాగే యావర్ ను బాగా సపోర్ట్ చేస్తున్నారని ఈమె తెలియజేశారు.

శివాజీ ఆట ఆడకపోయినా వీరి చేత ఆడిస్తున్నారని ఈమె తెలిపారు. నామినేషన్స్ లో భాగంగా మీరు ఆట ఆడలేదని శివాజీ గారిని నామినేట్ చేస్తే ఆయన అసలు ఒప్పుకోరని పూజ మూర్తి వెల్లడించారు. ఇక అమర్ గురించి మాట్లాడుతూ అమర్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. తనతో కలిసి నేను ఓ సీరియల్ కూడా చేశాను

అయితే బయట నేను చూసిన అమర్ లోపల ఉన్నటువంటి అమర్ పూర్తిగా వేరని బయట నేనే అందగాడిని అని గొప్పలు చెప్పుకునే అమర్ హౌస్ లోపల డీలా పడిపోయారని తెలిపారు. బయట ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించే అమర్ బిగ్ బాస్ హౌస్ లో పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారని ఈ సందర్భంగా పూజ మూర్తి (Pooja Murthy) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus