బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనీ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో సీరియల్ నటుడు అమర్ ఒకరు. ఈయన ఈ గేమ్ ఫస్ట్ లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ అనంతరం టైటిల్ రేస్ కి చేరుకున్నారు కానీ అత్యంత తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ రన్నర్ కావలసి వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం 15 వారాలను పూర్తిచేసుకుని ఎంతో విజయవంతంగా గ్రాండ్ ఫినాలే కూడా పూర్తి చేస్తుంది.
అయితే ఫినాలే రోజు అమర్ (Amardeep) కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నటువంటి కారుపై అభిమానులు దాడి చేయడంతో పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది అయి వివాదం తర్వాత అమర్ హైదరాబాద్ లో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు దీంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి వెంటనే అనంతపురం వెళ్లిపోయారు. అక్కడ అభిమానులతో, ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజులపాటు ఉన్నటువంటి అమర్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈయన హైదరాబాద్ వచ్చినప్పటికీ ఎవరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి అందుబాటులో లేరని తెలుస్తుంది.
అమర్ ఇంటర్వ్యూల కోసం ప్రతిరోజు దాదాపు 20 మంది దాకా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటికి వెళ్తున్నారు. అయితే అక్కడ అమర్ లేరు అనే విషయాన్ని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా హైదరాబాద్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేరని సమాచారం. బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో ఒత్తిడికి గురైనటువంటి అమర్ తన భార్య తేజుతో కలిసి కొంత సమయం పాటు ప్రశాంతంగా గడపడం కోసం వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది.
కొన్ని రోజులపాటు ఈయన ఎవరికి అందుబాటులోకి కూడా రారని తెలుస్తుంది ఇక ఇదే విషయం గురించి ఆయన స్నేహితుడు నరేష్ మాట్లాడుతూ అమర్ కి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం కనుక ఆయన తన భార్యతో కలిసి వెకేషన్ వెళ్లారని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారంటూ నరేష్ అసలు విషయం తెలియజేశారు.