‘బిగ్‌బాస్‌ 4’: ఆ స్పెషల్‌ రూమ్‌ ఏంటో.. ఎందుకో?

‘బిగ్‌బాస్‌’ అంటేనే ఊహించని సర్‌ప్రైజ్‌ ఇవ్వడం. దీనిని తొలి ఎపిసోడ్‌తోనే మరోసారి నిరూపించే ప్రయత్నం చేసింది బిగ్‌బాస్‌. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాగార్జున ఎలా ఉంటుంది అని అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో డబుల్‌ రోల్‌గా కనిపించి అబ్బురపరిచారు. డ్యాన్సర్ల హంగామా మధ్య గాలిలోంచి దిగిన నాగ్‌.. తనదైన శైలిలో స్టెప్పులతో అదరగొట్టాడు. కొవిడ్‌ జాగ్రత్తలు చెబుతూనే, కొవిడ్‌ వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని కూడా చూపించాడు. ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా మానసికంగా ఉండాలో కూడా చెప్పాడు.

ఆ తర్వాత అసలు హంగామా మొదలైంది. నాగార్జున అలా డ్యాన్సర్లను పంపించేసి టచ్‌ అప్‌ చేసుకున్నాడో లేదో రెండో నాగ్‌ వచ్చేశాడు. అదేనండి మొన్నామధ్య ఫస్ట్‌ ప్రోమోలో కనిపించిన ఓల్డ్‌ నాగ్‌ వచ్చాడు. కొడుకు (కుర్ర) నాగ్‌తో మాట్లాడి, పోట్లాడి, ముచ్చట్లాడి బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. అదేంటి ఫస్ట్‌ వెళ్లాల్సింది కంటెంస్టెంట్లు కదా అంటారు. బిగ్‌ బాస్‌ 4 కదా… కొంచెం కొత్తగా ట్రై చేశారు. పెద్ద నాగ్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌ అంతా తిరిగి చూపించాడు. గతంలో అయితే కేవలం వీడియోలో మాత్రమే కనిపించేది. బయట హోస్ట్‌ వివరించేవారు. ఈ సారి నాగ్‌ అంతా కలియతిరిగి చూపించారు.

హౌస్‌ లోపల ఏమున్నాయ్‌, ఎక్కడ ఎలాంటి డిజైన్లు, అలంకరణలు ఉన్నాయ్‌, కొత్తగా ఏం తెచ్చారు, పాత సీజన్లలో ఉన్న వాటిని ఏవైనా ఉంచారా లాంటి చర్చలూ సాగాయి. 14 మంది ఉంటారా, 16 మంది ఉంటారా అనే చర్చ కూడా పెద్దాయన తీసుకొచ్చాడు. దానికి కుర్ర నాగ్‌ ‘అది మేం చూసుకుంటాములే’ అని సస్పెన్స్‌ అలానే ఉంచేశాడు. అయితే అక్కడ కుర్చీలు లెక్కేసి 16 మంది పక్కా అని పెద్దాయన తేల్చేశాడు. మరి అంత మందే ఉంటారో లేదా చూడాలి. ఈ సారి ఇంట్లో స్పెషల్‌ రూమ్‌ కూడా క్రియేట్‌ చేశారు. అది త్వరలో ఓపెన్‌ చేస్తారట. ఏముందో ఆ రూమ్‌లో తెలియాలంటే… బిగ్‌బాస్‌ 4 కాస్త ముందుకెళ్లాలి. అన్నట్లు ఇంట్లో ఎవరెవరు ఉంటారో తర్వాత కథనంలో చెబుతాం. మళ్లీ ఇంకోసారి రండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus