Bigg Boss Telugu 5 Winne: బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్తున్న యూట్యూబ్ వీడియోలు..!

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 అంతిమ దశకి చేరుకుంది. గతంలో వచ్చినట్లుగా ఈసారి మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి వస్తాడా రాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ట్రిబుల్ ఆర్ టీమ్ మాత్రం ఫినాలే విన్నర్ ని ఎనౌన్స్ చేసేందుకు రాబోతున్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్ టాక్ అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి.

పబ్లిక్ ఓపీనియన్ ఏంటో చూడండి అంటూ తెగ పబ్లిక్ చేస్తున్నాయి. ప్రతి ఛానల్ సర్వేల్లోనూ ఒకటే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం టాప్ 5లో ఉన్నవాళ్లలో విజె సన్నీనే విన్నర్ అవుతాడంటూ పబ్లిక్ లో మెజారిటీ వీడియోస్ వస్తున్నాయి. అంతేకాదు, సన్నీకి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వకుండా పార్షియాలిటీ చూపిస్తే మాత్రం దర్నా చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు పబ్లిక్. ప్రస్తుతం అన్ అఫీషియల్ సైట్స్ లో కొన్ని పోలింగ్ సైట్స్ లో కూడా సన్నీకే ఎక్కువగా మెజారిటీ ఓట్లు పడుతున్నాయి.

నిజానికి లాస్ట్ సీజన్ లో విన్నర్ అయిన అభిజీత్ కి కూడా ఫైనల్ వీక్ ఇంత రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సగానికి సగం పైగా ఓట్లని సన్నీ కైవసం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సన్నీకి 50శాతం ఓటింగ్ నమోదు అవుతోంది. కొన్ని చోట్ల అయితే, 55శాతం కూడా అవుతోంది.ఇక సెకండ్ పొజీషన్ లో షణ్ముక్ జస్వంత్ ఉన్నాడు. షణ్ముక్ కి కేవలం 28 నుంచీ 30శాతం వరకూ మాత్రమే ఓటింగ్ జరుగుతోంది.

అయితే, శ్రీరామ్ చంద్రకి సెకండ్ పొజీషన్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు బిగ్ బాస్ వ్యూవర్స్. ఎందుకంటే, షణ్ముక్ కి గత కొన్నివారాలుగా ఆశించినంత ఓటింగ్ జరగటం లేదు. సన్నీ షణ్ముక్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్లాడు. దీంతో పబ్లిక్ అందరూ ఇప్పుడు సన్నీ గేమ్ ని బాగా ఇష్టపడుతున్నారు. అందుకే, సన్నీనే విన్నర్ నో డౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు విన్నర్ ఎవరు అవుతారు ? రన్నరప్ ఎవరు వస్తారు అనేది తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!


మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus