Nikhil: కావ్యతో బ్రేకప్.. ఓపెన్ అయిపోయిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ !

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్  (Nikhil)  అందరికీ సుపరిచితమే. అంతకు ముందు ‘గోరింటాకు’ వంటి పలు సీరియల్స్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఇతని పూర్తి పేరు నిఖిల్‌ మళియక్కల్‌ అయినప్పటికీ బిగ్ బాస్ నిఖిల్ గా బాగా ఫేమస్. ఇదిలా ఉండగా… ‘గోరింటాకు’ సీరియల్ నటి కావ్యతో ఇతను కొంతకాలం ప్రేమాయణం నడిపాడు. పలు షోలలో కూడా వీళ్ళు సందడి చేశారు. కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు ప్రచారం జరిగింది.

Nikhil

‘బిగ్ బాస్ 8’ లో నిఖిల్ ఉన్నప్పుడు అతనికి కావ్య సపోర్ట్ చేస్తుంది అని కొందరు అనుకున్నారు. కానీ మధ్యలో ఒకసారి పేరు ప్రస్తావించకుండా ‘తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యింది… కానీ ఆమె లేకుండా ఉండటం కష్టంగా ఉంది’ అన్నట్టు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు కావ్య కూడా పరోక్షంగా ‘అది యాక్టింగ్’ అన్నట్టు సెటైర్ విసిరింది. అయినప్పటికీ ఈ జంటని అభిమానించేవారు ఏదో ఒక పోస్టుకి వీళ్ళని కలిపి ట్యాగ్ చేస్తూనే ఉన్నారు.

అయితే అలా ట్యాగ్ చేసే వారికి తాము బ్రేకప్ అయిపోయాము అన్నట్టు క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ.. “మీ ప్రేమాభిమానాలకు ధన్యుడను. మీ ఆదరణ, ప్రేమ వల్లే నేను ఈ ఈరోజు ఇలా ఉన్నాను అని భావిస్తాను. కానీ నాదొక చిన్న విన్నపం. ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము.

అందువల్ల మీ సపోర్ట్ ఏదైనా ఉంటే… అది నాకు వ్యక్తిగతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను నన్నుగా ప్రేమించండి. నేను మీకోసం… మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చేయాల్సింది చాలా ఉంది. అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను ఎవరితో కలిపి ఒకే పోస్టులో ట్యాగ్ చేయకండి. నా ఈ విన్నపాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తారని భావిస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు. సో నిఖిల్ కామెంట్స్ ను బట్టి కావ్యతో అతను పూర్తిగా సెపరేట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

 ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus