Bigg Boss Non-Stop: బిగ్ బాస్ హౌస్ లోకి విన్నర్ ని పంపించడానికి గల కారణం ఇదేనా?

బిగ్ బాస్ హౌస్ లో ఆరు వారాలు గడిచిపోయాయి. నిజానికి టెలివిజ్ సీజన్ లో అయితే ఈపాటికి విన్నర్ ఎవరో తెలిసిపోయేది. గత ఐదు సీజన్స్ గా ఇలాగే ముందుగానే విన్నర్ ని డిసైడ్ చేసేస్తారు ఆడియన్స్. అందుకే, ఈసారి హౌస్ లోకి విన్నర్ నే పంపిస్తే ఎలా ఉంటుందని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మాత్రం కాదు. కేవలం గెస్ట్ గానే పంపించాలనుకుంటున్నారు. ప్రతివారం ఓటీటీ బిగ్ బాస్ షోలోకి ఏదో ఒక గెస్ట్ రావడం అనేది జరుగుతూనే ఉంది.

అయితే, ఈసారి మాత్రం బిగ్ బాస్ విన్నర్ ని పంపించి హౌస్ మేట్స్ కి టిప్స్ ఇచ్చేవిధంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీజన్ 4 విన్నర్ అభిజీత్, లేదా సీజన్ 5 విన్నర్ సన్నీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ముమైత్ ఖాన్, స్రవంతి ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకి వచ్చేశారు. ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే కంటెస్టెంట్స్ ఉన్నారు.

ఇందులో ఆరువారాలు పాటు మరో ఆరుగురిని ఎలిమినేట్ చేస్తే ఫైనల్స్ కి లెక్క కరెక్ట్ గా సరిపోతుంది. ఈసారి టాప్ 5లో ఉండే ఛాలెంజర్స్ సీజన్ 6కి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈసారి ఓటీటీ టైటిల్ రేస్ లో చాలామంది పోటీ పడుతున్నారు. అఖిల్, బిందుమాధవి, శివ, అరియానా, అషూరెడ్డి, హమీదా ఇలా అందరూ టైటిల్ పై కన్నేశారు. ఏ ఒక్కరికీ హైప్ లభించినా, క్రేజ్ వచ్చినా, ఎలివేషన్ దొరికినా ఖచ్చితంగా టైటిల్ ఎగరేసుకుపోతారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ హౌస్ లోకి రావడం అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, విన్నింగ్ టిప్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గేమ్ ఛేంజ్ అవుతుంది. మిగతా హౌస్ మేట్స్ దాన్ని బట్టీ గేమ్ ని మారుస్తారు. ఇప్పటికే బిందుమాధవి, యాంకర్ శివ ఇద్దరి గేమ్ పైన మిగతా హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ యాంకర్ శివని టార్గెట్ చేశాడు.

ఏం పని చేయట్లేదని, పని చేయకుండా కూర్చుని తింటూ, బెడ్ పైన పడుకుని కామెంట్స్ చేస్తున్నాడని మాటలు విసిరారు. అంతేకాదు, అఖిల్ అండ్ టీమ్ కూడా బిందు మాధవిని టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. అందుకే గేమ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus