Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » పాజిటివ్ రివ్యూలతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ‘బిగ్ బాస్’ శ్వేతా వర్మ ‘ఏకమ్’ చిత్రం..!

పాజిటివ్ రివ్యూలతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ‘బిగ్ బాస్’ శ్వేతా వర్మ ‘ఏకమ్’ చిత్రం..!

  • October 30, 2021 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాజిటివ్ రివ్యూలతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ‘బిగ్ బాస్’ శ్వేతా వర్మ ‘ఏకమ్’ చిత్రం..!

అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి,అదితి మైకేల్, కల్పిక గణేష్,దయానంద్ రెడ్డి, ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్వేతా వర్మ  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏకమ్’. బోయపాటి రఘు సమర్పణలో ‘ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ’, ‘సంస్క్తృతి ప్రొడక్షన్స్’, ‘డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్’ కలిసి నిర్మించిన చిత్రమిది. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వరుణ్ వంశీ దర్శకత్వం వహించాడు. నిన్న అంటే అక్టోబర్ 29న(శుక్రవారం నాడు) విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ లభించింది. విడుదల ముందు నుండీ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ముందుగానే ఈ చిత్రం ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్’ ను సొంతం చేసుకుంది.. దానికి తోడు  ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి సంస్థలో ఈ చిత్రానికి 9.7/10 రేటింగ్ నమోదవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక సినిమా విషయానికి వస్తే .. ఓపెనింగ్లోనే దర్శకుడు ఇది పూర్తిగా 5 పాత్రల చుట్టూ తిరిగే కథ అని క్లారిటీ ఇచ్చేసాడు.దాంతో  ‘ఏకమ్’ అనే టైటిల్ పెట్టినట్టు కూడా స్పష్టత వచ్చేసింది. టైటిల్ కార్డ్స్ పడ్డ విధానం బట్టి దర్శకుడి ప్రతిభ ఏంటన్నది స్పష్టమవుతుంది.

ఇక కథ విషయానికి వచ్చేస్తే….  ఆనంద్ (అభిరామ్ వర్మ ) తన చిన్నతనంలోనే కుటుంబాన్ని పెద్దయ్యాక ప్రేమించిన అమ్మాయిని, మంచి  జాబ్ ను పోగోట్టుకుని ఈ ప్రపంచంలో దేనికోసమో అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు. దేవుడు తనకి ఏమీ లేకుండా చేసేసాడు అంటూ భావించి దేవుడు(విష్ణువు) పై కోపం పెట్టుకుంటాడు. అక్కడితో ఆగకుండా అదే దేవుడిని స్మశానం లోకి తీసుకొనిపోయి అక్కడే నివసించడానికి రెడీ అవుతాడు. దివ్య(అదితి మైకేల్ )  తండ్రిని కోల్పోయిన అమ్మాయి. ఎప్పటికైనా ఓ కాఫీ షాప్ పెట్టి ఎదగాలని తన డ్రీం ను ఫుల్ ఫిల్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో  డేవిడ్(దయానంద్ రెడ్డి   విలన్) దివ్య కాఫీ షాప్ లో జాబ్ కావాలి అని వచ్చి ఆమెని కన్విన్స్ చేసి జాబ్ లో జాయిన్ అవుతాడు.ఇక నిత్య(కల్పిక గణేష్ ) ఆనంద్ ప్రేయసి… ఎలాగైనా ప్రియుడిని మార్చుకొని అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతోంది. ఇక నిర్వాణ (బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ) తన ప్రేమించిన అబ్బాయికి కొన్ని అనుకోని సంఘటనల వల్ల దూరమవుతుంది.కానీ అనుకోకుండా నిర్వాణ, అభిరామ్ కలుసుకుంటారు? వాళ్ళు ఎందుకు కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు? మిగిలిన వాళ్ళ కారణంగా వీళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెరపై చూడాల్సిన కథ.

ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయమే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బోర్ కొట్టించదు.అలాగే దర్శకుడు కథలోకి తీసుకెళ్ళిన విధానం కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆనంద్ వర్మ,శ్వేతా వర్మ ల పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. శ్వేతా వర్మ బిగ్ బాస్ అభిమానులు.. ఆమె పాత్రని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆమెనే కాబట్టి.. వాళ్ళని నిరాశపరచదు. ఇక తనికెళ్ళ భరణి విష్ణుమూర్తి భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు.కల్పిక పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆమె పాత్ర చాలా కీలకం. అలాగే ఉన్నంతలో ఆమె చాలా బాగా నటించింది. దయానంద్ రెడ్డి… ఎన్నో అవార్డులు అందుకున్న నటుడు కాబట్టి ఇక్కడ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని ఎంతో ఈజ్ తో చేసాడు.ఇతని పాత్రకి కూడా మంచి మార్కులు పడతాయి. సెకండ్ హాఫ్ లో వచ్ఛే విష్ణువు సాంగ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు జోస్ ఫ్రాంక్లిన్ కు ఇక్కడ ఫుల్ మర్క్స్ వేసెయ్యొచ్చు. దర్శకుడు వరుణ్ వంశీ సంభాషణలు కూడా ఆకట్టుకునేలా అదేవిధంగా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి. నిర్మాతకి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందనేది ఈ చిత్రంతో చెప్పకనే చెప్పాడు.మరీ ముఖ్యంగా ఇక్బాల్ అజ్మీ సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. అతని పనితనం అందరినీ మెప్పిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ అంత బాగా రావడానికి సినిమాటోగ్రాఫర్ కృషి చాలా ఉందనిపిస్తుంది.

మొత్తంగా మంచి కథాబలం ఉన్న చిత్రమిది.దానికి క్యాస్టింగ్,మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలోగ్స్ వంటివి బాగా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో నిడివి తక్కువ ఉండటం,అలాగే సడెన్ క్లైమాక్స్ వంటివి మైనస్ పాయింట్లుగా చెప్పొచ్చు.అయితే ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ ను అయితే ‘ఏకమ్’ కచ్చితంగా ఇస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి..వీకెండ్ కు థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది అక్కడ మిస్ అయితే ఓటిటిల్లో అయినా నిస్సందేహంగా ఓసారి చూడాల్సిన సినిమా..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'ekam' movie
  • #Abhiram
  • #kalpika ganesh
  • #swethavarmas

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

10 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

11 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

13 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

16 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

16 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

13 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

14 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

16 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

16 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version