Bindu Madhavi: బిగ్ బాస్ ట్రోఫీ అందుకుని బిందు మాధవి ఏం చెప్పిందంటే..!

  • May 22, 2022 / 02:13 AM IST

18మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ 24 x 7 లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం అయినపుడు ఎన్నో విమర్శలు వినిపించాయి. అసలు ఇన్ని గంటలు ఈ షోని ఎవరు చూస్తారు అని చాలామంది కామెంట్స్ చేశారు. మెల్ల మెల్లగా 24గంటల కంటెంట్ లో హైలెట్స్ ని చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ గేమ్ కి అలవాడు పడ్డారు ఆడియన్స్. ఇక అక్కడ్నుంచీ బిందు మాధవి – అఖిల్ మద్యలో నామినేషన్స్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడటం స్టార్ట్ చేశారు. బిందు మాధవి రెండో వారం నుంచీ అఖిల్ తో గట్టిగా గేమ్ ఆడింది. సై అంటే సై అంటూ లాజిక్స్ వెతుకుతూ నామినేషన్స్ లో తన పవర్ ని చూపించింది.

అందరూ బిందుని ఆడపులిలా గేమ్ ఆడుతోందని అభివర్ణించారు. హౌస్ లో తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ బిగ్ బాస్ టాప్ – 7లో ఒకరిగా నిలిచింది బిందుమాధవి. బయట ఉన్న ఆడియన్స్ కూడా బిందు గేమ్ ని లైక్ చేస్తూ టాప్ రేంజ్ లో ఓటింగ్ చేశారు. దీంతో ఫినాలే లో టైటిల్ ఫేవరెట్ గా నిలించింది. లాస్ట్ రౌండ్ లో కింగ్ నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్రీఫ్ కేస్ లో క్యాష్ ఉందని, అరియానా 10 లక్షలు తీస్కుందని, అలాగే మీరు కూడా ఇందులో ఉన్న ఎమౌంట్ ని తీస్కోవచ్చని చెప్పాడు.

కానీ, అఖిల్ – బిందు మాధవి ఇద్దరూ కూడా సూట్ కేస్ ని రిజక్ట్ చేశారు. దీంతో ఇద్దరిని స్టేజ్ పైకి తీస్కుని వచ్చాడు హౌస్ట్ నాగార్జున. ఇద్దరి చేతులని పైకి లేపుతూ చాలాసేపు ఉత్కంఠభరితంగా ఫినాలే విన్నర్ ని ఎనౌన్స్ చేశాడు. బిందు మాధవి విన్నర్ అని చెప్పగానే, హౌస్ మేట్స్ అందరూ గోల చేశారు. బిందు సపోర్టర్స్ అందరూ ఉత్సాహంతో రెచ్చిపోయారు. ఇక అఖిల్ లాస్ట్ టైమ్ సీజన్ -4 లో లాగానే రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ట్రోఫీ తీస్కున్న బిందు ఆనందంతో ఉబ్బితబ్బిబై పోయింది.

బిందు అమ్మానాన్నలని గట్టి హత్తుకుని మీ కూతురు గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు, సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందని, లేట్ గా వస్తే నిరుత్సాహపడొద్దని స్పీచ్ ఇచ్చింది. లేట్ గా సక్సెస్ రాకుండా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ కూడా ఈ టైటిల్ ని అంకితం ఇస్తున్నానంటూ చెప్పింది. ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అంటుంటారని, ఇంకా ఎన్నాళ్లు ప్రయత్నిస్తావ్ అంటూ మాటలు విసురుతారని, అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుందని చెప్పింది.

అందుకు నేను ఉదాహరణ అని, తెలుగులో అవకాశాలు లేనపుడు, తమిళ బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు తెలుగు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదని, ఇప్పుడు ఈ ట్రోఫీ తీస్కోవడం చాలా గర్వంగా ఉందని చెప్పింది బిందు. ఇక రన్నరప్ గా నిలిచిన అఖిల్ కూడా సంతోషంగానే ఉన్నానని, హౌస్ లోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా మారాను అంటూ చెప్పుకొచ్చాడు.

బిందు స్పీచ్ కి ఆడియన్స్ తో పాటుగా, హౌస్ మేట్స్ , ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిదా అయిపోయారు. హౌస్ట్ నాగార్జున కూడా బిందు టైటిల్ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైమ్ తెలుగు సీజన్ లో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అంతేకాదు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ సైతం బిందుకి అభినందనలు తెలిపింది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus