బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 చాలా గ్రాండ్ గా ముగిసింది. ఫస్ట్ టైమ్ లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ టైటిల్ గెలుచుకుంది. టైటిల్ తో పాటుగా ట్రోఫీని, అలాగే ప్రైజ్ మనీని కూడా గెలుచుకుంది. నిజానికి ప్రైజ్ మనీ 50 లక్షలు ఇవ్వాలి. కానీ, అరియానా టాప్ – 4లో ఉండి 10 లక్షల ప్రైజ్ మనీతో బయటకి వచ్చింది కాబట్టి, విన్నర్ ప్రైజ్ మనీలో నుంచీ ఈ 10 లక్షలు తగ్గించేస్తారు. అందుకే, బిందుకి ప్రైజ్ మనీగా 40 లక్షలు మాత్రమే వచ్చాయి.
ఇక ఓటీటీ సీజన్ లో లాస్ట్ వీక్ వరకూ ఉన్న బిందు మాధవి దాదాపుగా 12 వారాల పాటు గేమ్ ఆడింది. వారానికి 5 లక్షలు చొప్పున బిందు మాధవికి 60 లక్షలు పైగానే రెమ్యూనిరేషన్ దక్కినట్లుగా సమాచారం. నిజానికి ఈసారి సీజన్ లో అందరికంటే కూడా బిందుకే రెమ్యూనిరేషన్ అనేది ఎక్కువ. ఎన్ని వారాలు ఉంటే అంత బెనిఫిట్. అందుకే, నటరాజ్ మాస్టర్, అరియానా, అషూరెడ్డి, అఖిల్ ఇలా అందరూ కూడా ఎక్కువ వారాలు ఉండటానికి చూశారు.
నటరాజ్ మాస్టర్ , అరియానా గ్లోరీ ఇద్దరూ అయితే డబ్బులు కూడా లెక్కలు వేసుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీలో ఈసారి స్పాన్సర్స్ లేరు. అయినా కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిర్వాహకులు కేవలం హాట్ స్టార్ స్పాన్సర్ తోనే డబ్బులు సంపాదించుకోవాల్సి వచ్చింది. అందుకే, ఈసారి సీజన్స్ లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్లని పిలిచారు. ఇందులో తేజస్వి, అరియానా, అషూరెడ్డి, హమీదాలకి ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే, బిందు మాధవికి హీరోయిన్ గా మంచి ఫేమ్ ఉంది.
అందులోనూ ఓటీటీ అనేది బోల్డ్ ఫ్లాట్ ఫార్మ్. అందుకే, భారీగా రెమ్యూనిరేషన్ ఒప్పుకున్నారట. ఈసారి సీజన్ లో అందరికీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ – 5 లో కంటే కూడా ఓటీటీ కోసం టీమ్ ఎక్కువ ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక బిందు విషయంలో అయితే, ప్రైజ్ మనీతో కలిపితే కోటి రూపాయాలు పైనే డబ్బులు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ తింటున్నారు.
సెలబ్రిటీలు ఎన్ని సినిమాలు చేస్తే కోటి రూపాయలు రావాలి ? ఇలాంటి సీజన్ లో ఒక్కసారి పార్టిసిపేట్ చేసి చివరివరకూ ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటున్నారు. ఇక కోటిరూపాయల్లో ట్యాక్స్ లు పోనూ 90 లక్షలు పైగానే బిందుకి ముట్టజెప్పారట. ఇంకా మా టీవి షోలలో వచ్చిన ప్రతిసారి కూడా రెమ్యూనిరేషన్ అనేది వేరే విధంగా ఉంటుంది. అలాగే, హాట్ స్టార్ లో కూడా అమ్మడికి రెండు మూడు వెబ్ సీరిస్ లు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఇక అనిల్ రావిపూడి తీయబోయే నెక్ట్స్ పిక్చర్ లో కూడా బిందుకి ఆఫర్ ఉన్నట్లుగా సమాచారం. మొత్తానికి తమిళ సీజన్ కంటే కూడా తెలుగు సీజన్ లోనే బిందుకి బాగా గిట్టుబాటు అయ్యింది. ట్రీఫీ గెలిచింది. అమ్మడి పంటా పండింది అంటున్నారు నెటిజన్స్. అదీ మేటర్.