Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 19, 2026 / 12:08 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పవన్ కళ్యాణ్ (Hero)
  • శ్రీలీల, రాశీ ఖన్నా (Heroine)
  • గౌతమి, పార్తీబన్, రావు రమేష్, కె.ఎస్.రవికుమార్, రాంకీ తదితరులు (Cast)
  • హరీష్ శంకర్.ఎస్ (Director)
  • నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ (Producer)
  • దేవి శ్రీ ప్రసాద్ (Music)
  • అయినంక బోస్ (Cinematography)
  • కార్తీక్ శ్రీనివాస్ (Editor)
  • Release Date : 19 మార్చి 2026
  • మైత్రి మూవీ మేకర్స్ (Banner)

12 ఏళ్ళ క్రితం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మేనియాని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) 10 ఏళ్ళుగా సరైన హిట్టు లేదు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ తిరిగి పవన్ కళ్యాణ్ ని హిట్ ట్రాక్ ఎక్కించడమే కాదు.. అభిమానుల ఆకలి కూడా తీర్చాడు అని చెప్పాలి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ప్రెజెంట్ చేసిన తీరు అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది ‘గబ్బర్ సింగ్’.

అలాంటి కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’  (Ustaad Bhagat Singh) అనే సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఆ అంచనాలు ఈ సినిమా అందుకుందా? లేదా? అనేది తెలుసుకుందాం రండి :

Ustaad Bhagat Singh Movie Review

Ustaad Bhagat Singh Movie Review and Rating

కథ: సీఎం చంద్రశేఖర్ రావు(కె ఎస్ రవి కుమార్) పై ఊహించని విధంగా ఓ దాడి జరుగుతుంది. అది చేయించింది నల్లా నాగప్ప(పార్తీబన్). చంద్రశేఖర్ రావుని చంపేస్తే సీఎం పదవి వస్తుంది అనేది అతని ఆశ. అయితే నాగప్ప ప్లాన్స్ కి అడ్డుపడతాడు భగత్ సింగ్(పవన్ కళ్యాణ్). నాగప్ప కి భగత్ సింగ్ ఎందుకు అడ్డుపడతాడు? చంద్రశేఖర్ రావుకి ఉస్తాద్ భగత్ సింగ్ కి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో శ్లోక(రాశీ ఖన్నా) ఎవరు.? భగత్ సింగ్ గతమేంటి? లీల(శ్రీలీల) ఎవరు? ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే.

Ustaad Bhagat Singh Movie Review and Rating

నటీనటుల పనితీరు: పవన్ కళ్యాణ్ నటన ఈ మధ్య కాలంలో ఎక్కువ సీరియస్ రోల్స్ చేశాడు. బహుశా పాలిటిక్స్ లో ఉన్నాడనో ఏమో కానీ.. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ ఇలా అన్ని సినిమాల్లోనూ పవన్ చేసినవి సీరియస్ రోల్సే. దీంతో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అనేవి వాటిలో మిస్ అయ్యాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో మాత్రం వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఈ సినిమాకి పవన్ వన్ మెన్ షో చేశాడని చెప్పొచ్చు. ఇంట్రో సీన్ నుండి క్లైమాక్స్ వరకు పవన్ కళ్యాణ్ తన శ్వాగ్ తో మెస్మరైజ్ చేస్తాడు. అలాగే ఇందులో చాలా అందంగా, స్టైలిష్ గా కూడా కనిపించాడు.

కొన్ని చోట్ల తనపై తాను సెటైర్లు వేసుకోవడం అలాగే మహేష్ బాబు వంటి మరో స్టార్ హీరో పాటకి కూడా డాన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ తర్వాత కె.ఎస్.రవి కుమార్, పార్తీబన్ పాత్రలకి మంచి మార్కులే పడతాయి. రాశీ ఖన్నా ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. ఆమె పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఏమీ ఉండదు. ఏదో పెట్టాలని పెట్టారు అంతే. సెకండాఫ్ లో శ్రీలీల పాత్ర ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ని కొన్ని చోట్ల ఆమె ఇమిటేట్ చేసే విధానానికి ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం. ఇక సీనియర్ నటి గౌతమి,రావు రమేష్ వంటి పెద్ద నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. మిగతా నటీనటులు ఓకే ఓకే అనిపిస్తారు.

Ustaad Bhagat Singh Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చాలా చిన్న కథ. అలాగే రెగ్యులర్ కథ. స్క్రీన్ ప్లే కూడా ఊహించినట్టే సాగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్.. ‘ఇది గొప్ప కథ’ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ మిస్సైన పవన్ కళ్యాణ్ ని చూపిస్తానని, అలాగే ఓ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూశామనే సంతృప్తిని కామన్ ఆడియన్స్ కి ఇస్తానని’ మాత్రం ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మొదటి నుండి ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని హరీష్ శంకర్ ఇలా ప్రిపేర్ చేయడం మంచిదే అయ్యింది. అనవసరమైన హైప్ లేపకుండా ఉండటం వల్ల.. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ధియేటర్ కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలా వచ్చిన వాళ్ళని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజప్పాయింట్ చేయదు..! ఎంతో కొంత ఎంటర్టైన్ చేసే పంపుతుంది.

కాకపోతే ‘గబ్బర్ సింగ్’ కాంబో కథా అని ఎక్కువగా ఆశించి వచ్చిన వాళ్లకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ గా స్టార్ట్ అయినా హీరో ఇంట్రో సీన్ డిజైన్ చేసిన తీరు, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.కామెడీ ఎక్కువగా పేలలేదు. అలా అని క్రింజ్ అంటూ విమర్శించే రేంజ్లో ఉండదు. టైం పాస్ చేయిస్తుంది. సెకండాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం బెటర్ గానే ఉంటుంది. ‘తొలిప్రేమ’ లోని ‘ఈ మనసే సే సే’ అనే పాటని ఇందులో రీమిక్స్ చేశారు. అది స్క్రీన్ పై చాలా కలర్ఫుల్ గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ‘ఓజి’ రేంజ్లో ఆశించకూడదు. కానీ బాగానే కుదిరింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణ విలువలకి పేరు పెట్టాల్సిన పని లేదు.

Ustaad Bhagat Singh Movie Review and Rating

విశ్లేషణ: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి నుండి ‘తేరీ’ రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. ఒక రకంగా అది చాలా మందిని ఇబ్బంది పెట్టింది. దర్శకుడు హరీష్ ప్రమోషన్స్ లో ‘ఇది రీమేక్ కాదు’ అని చెప్పినప్పటికీ.. చాలా మంది నమ్మలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ కి దక్కే ఫస్ట్ రిలీఫ్ అదే. అలాగే ‘గబ్బర్ సింగ్’ రేంజ్ అంచనాలు పెట్టుకోకుండా వెళితే.. ‘డీసెంట్ సినిమా చూశామనే’ ఫీలింగ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇస్తుంది. ‘వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తాను’ అంటూ హరీష్ ఇచ్చిన మాటనైతే అతను నిలబెట్టుకున్నాడు.

Ustaad Bhagat Singh Movie Review and Rating

ఫోకస్ పాయింట్: పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #harish shankar
  • #pawan kalyan
  • #Raashii Khanna
  • #Sreeleela

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

19 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

24 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version