Bindu Madhavi: అఖిల్ , అజయ్ లని ఆట ఆడుకున్న బిందు..! గొడవలో అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ హౌస్ లో నాలుగోవారం కెప్టెన్సీ టాస్క్ అనేది పెద్ద యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కీలుగుర్రం టాస్క్ లో చివర్లో యాంకర్ శివ, అజయ్, ఇంకా నటరాజ్ మాస్టర్ లు మాత్రమే మిగిలారు. వీళ్లు చెక్క గుర్రాల మీద కూర్చుని ఉన్నప్పుడు శివకి జ్యూస్ ఇచ్చి గుర్రం దింపేందుకు అషూరెడ్డి వాదనకి దిగింది. సంచాలక్ గా ఉన్న అరియానా కొన్ని పాయింట్స్ ని కన్సిడర్ చేస్తోంది. ఇక్కడే అషూరెడ్డి సెల్ఫ్ సెంట్రిక్ గా ఉన్నవని, నీకు కిచెన్ గురించి కూడా తెలియదని రీజన్స్ చెప్తూ శివని పోటీ నుంచీ తప్పుకోమంది.

Click Here To Watch NOW

శివకి సపోర్టింగ్ గా మాట్లాడిన బిందుమాధవి మాటలతో రెచ్చిపోయింది. సెల్ఫ్ సెంట్రిక్ గా మాట్లాడుతుంది మీరని, నామినేషన్స్ అప్పుడు కూడా ఫ్రెండ్ కోసం శాక్రిఫైజ్ చేసేశారని గుర్తు చేసింది. ఇందులో ఇన్వాల్ అయిన అఖిల్ కి సాలిడ్ పంచ్ ఇచ్చింది బిందు. నేను ఇలాంటి గేమ్ లు ఆడా.. అని మాట్లాడితే నువ్వు ఆడా.. నువ్వు ఆడా.. అంటూ అఖిల్ ని రెచ్చగొట్టింది. అంతేకాదు, నువ్వు ఫ్రెండ్స్ లేకపోతే ఇంట్లో బతకలేవు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇక శివ కోసం ఆర్గ్యూమెంట్ వదిలేసి వీరిద్దరూ గొడవపడ్డారు. మాటకి మాట అనుకుంటూ రెచ్చిపోయారు. బిందమాధవి ఏమాత్రం తగ్గకుండా ముగ్గురు నలుగురికి సమాధానం చెప్పింది. అఖిల్ చాలాసేపు బిందుమాధవితో ఈవిషయంలో ఆర్గ్యూమెంట్ చేశాడు. మీకు ఇష్టమొచ్చినట్లుగా మాటలు అనొద్దని చెప్పాడు. అంతేకాదు, బిందు మాటలకి బాగా ఎమోషనల్ అయిపోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. నేను ఇక్కడికి రన్నరప్ అయినా కూడా వచ్చింది గేమ్ ఆడటానికే అని అన్నాడు. మీతో మాటలు పడటానికి రాలేదని, ఎమోషనల్ అయిపోయాడు. ఏడ్చేశాడు. దీంతో అషూరెడ్డి, అరియానా, స్రవంతిలు గొడవని సముదాయించే ప్రయత్నం చేశారు.

యాంకర్ శివ తర్వాత అజయ్ ని గుర్రం నుంచీ దింపేందుకు డిబేట్ జరిగింది. కన్విన్స్ అయిన సంచాలక్ అరియానా అజయ్ ని దిగిపోమని చెప్పింది. అజయ్ గుర్రం నుంచీ కిందకి దిగిన తర్వాత శివని దింపేందుకు జ్యూస్ ఇచ్చాడు. ఇక్కడే యాంకర్ శివ కూడా నాలాగా కిచెన్ లో పనికిరాడని చెప్పి వాదించాడు. ఇక్కడే బిందుమాధవిని రెచ్చగొట్టాడు. ఫ్రెండ్స్ లేకపోతే బతకలేవని అకిల్ తో అన్నావని ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లో నేను కూడా ఉన్నా అంటూ రెచ్చిపోయి మరీ బిందుపై అరిచాడు. దీంతో బిందుమాధవి వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అంటూ అజయ్ పైకి వచ్చింది. అజయ్ ఆవేశంలో తిడుతూ ఊగిపోయాడు. ఈ ఇష్యూ కాస్త చల్లారిన తర్వాత యాంకర్ శివని దిగిపోమని చెప్పింది అరియానా. దీంతో నటరాజ్ మాస్టర్ ఈవారం కెప్టెన్ అయ్యాడు.

ఆ తర్వాత స్రవంతి అఖిల్ ఎందుకు ఫీల్ అయ్యాడో వివరంగా బిందుమాధవికి చెప్పింది. బిందుమాధవి నేను ఆడా అనేది స్లాంగ్ లో మాట్లాడాను అని, అది రాంగ్ గా తీస్కుంటే నా తప్పు కాదని క్లియర్ గా చెప్పింది. నేను తప్పు చేయనపుడు వెళ్లి సారీ చెప్పనని అన్నది. అంతేకాదు, స్రవంతి ఇక్కడ బిందుమాధవి ఉద్దేశ్యాన్ని క్లియర్ గా గమనించింది. మరి ఈ విషయం అఖిల్ కి చెప్పి ఇద్దర్నీ కలుపుతుందా ? లేదా వీకండ్ నాగార్జున ఇష్యూని సాల్వ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus