బర్త్‌డే స్పెషల్‌: ఆ ఛట్రంలో ఇరుక్కోకుండా దూసుకెళ్తున్న తారక్‌!

అందరూ నా వాళ్లే.. అందరికీ నేను కావాల్సిన వాడినే… – ఇలా ఉండటం, ఇలాంటి అభిమానం సంపాదించడం చాలా కష్టం. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్‌, రెస్పాన్స్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. సుమారుగా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న, అభిమానం సంపాదిచుకున్న కథానాయకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ప్రేక్షకులు ‘మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌’ అని ముద్దుగా పిలుచుకున్న నందమూరి తారకరాముడు.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిత్వంలో ఓ అంశాన్ని తరచి చూద్దాం.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కదా అని… ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా ఏదైనా చెబుదాం అని చూస్తుంటే… ఆయన ఇటీవల కాలంలో చెప్పిన మాటలు, చేసిన పనులు కొన్ని కనిపించాయి. అందులో బాగా ప్రస్ఫుటంగా కనిపించిన అంశం ఆయన స్నేహం. సినిమా కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, సినిమాలతో బాగా అనుబంధం పెంచుకున్న వ్యక్తి మొత్తం సినిమా మనిషి కాబట్టి.. అతని స్నేహం సినిమా వాళ్లతోనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా తారక్‌ స్నేహాన్ని డీకోడ్‌ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం.

టాలీవుడ్‌లో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోల మధ్య స్నేహం సాధ్యమా? అంటే దాదాపు కష్టమే అని చెబుతారు. కానీ తారక్‌, రామ్‌చరణ్‌ ఆ మాటను అబద్దం చేసి చూపించారు. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలో కలసి నటించడం మాత్రమే కాదు, ఆ సినిమా ప్రచారంలో వాళ్లు చెప్పిన విషయాలు చాలావరకు ఆశ్చర్యం కలిగించేవే. పరస్పరం భిన్న ధృవాలుగా ఉండే మనస్తత్వాలున్న చరణ్‌, తారక్‌ స్నేహం అద్భుతం. వాళ్ల స్నేహం గురించి చెబుతుంటే స్నేహమే మురిసిపోతుంది.

పెద్ద హీరో కదా స్నేహితులు అందరూ పెద్ద హీరోలే ఉంటారు అని అనుకోవడానికి వీళ్లేదు. తారక్‌ స్నేహితుల్లో అత్యధిక శాతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, చిన్న చిన్న పాత్రలు చేసినవాళ్లే. రాజీవ్‌ కనకాల, సమీర్‌, రాఘవ, రఘు లాంటి స్నేహితులు తారక్‌కి ఉన్నారు. అదే సమయంలో యువ హీరోలతో కూడా స్నేహం చేస్తుంటాడు. ఇదే సమయంలో తన కంటే సీనియర్‌ హీరోలతో కూడా మంచి ర్యాపో మెయింటైన్‌ చేస్తుంటాడు.

నందమూరి కుటుంబం కాబట్టి సినిమాలతోపాటు రాజకీయాలు కూడా ఉంటాయి. తెలుగు దేశం పార్టీ కోసం తారక్‌ ప్రచారం చేశారు. ఈ క్రమంలో చాలామంది రాజకీయ స్నేహితుల్ని కూడా సంపాదించాడు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ… ఇప్పటికేఈ తారక్‌కు స్నేహితులే. ఇక తెలుగు దేశంలోనూ స్నేహితులు ఉంటారు. అదేసమయంలో ఇతర పార్టీల్లోనూ ఉన్నారు.

తారక్‌ గతంలో సీనియర్‌ స్టార్‌ హీరో గురించి ఏదో అన్నాడు అంటూ వార్తలొచ్చాయి. అందులో నిజమెంత అనేది పక్కనపెడితే… ఆయన తన కంటే పెద్ద హీరోలను ఎంతో గౌరవంగా చూస్తారు. సమకాలీకులు ఎదురుపడితే తారక్‌ వేసే జోకులు, చేసే సరదాలు చాలా బాగుంటాయి. పంచ్‌లు వేయడం, పంచ్‌లు వేయించుకోవడం తారక్‌కి అలవాటు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో భాగంగా తన తోటి హీరోలతో తారక్‌ మెలిగే తత్వం కూడా చూసే ఉంటారు. మహేష్‌బాబుతో ‘అన్న’ అంటూ తారక్‌ ఎంతగా కలసిపోయాడో చూశాం.

ఇదంతా ఎందుకు అంటే.. సినిమా హీరోలన్నాక తామరాకు మీద నీటి బొట్టులా ఎవరికీ అతుక్కోకుండా, అందరి వారిలా ఉండాలి అని అంటుంటారు. తారక్‌ తన స్నేహం, ప్రేమతో అందరితో అలా కలసిపోతుంటాడు అని చెప్పడానికే. చాలా తక్కువమందిలో ఉండే ఈ గుణం తారక్‌ సొంతం కావడం ఆనందమే కదా. వన్స్‌ అగైన్‌ హ్యాపీ బర్త్‌డే తారక్‌.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus