Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Reviews » Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 28, 2026 / 06:47 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అర్జున్ సర్జా (Hero)
  • అభిరామి (Heroine)
  • ప్రీతీ ముకుందన్,జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం,వివేక్ ప్రసన్న,పవన్ కృష్ణ తదితరులు (Cast)
  • సుభాష్ కె రాజ్ (Director)
  • కల్పతి ఎస్ అఘోరం (Producer)
  • కల్పతి ఎస్ అఘోరం (Music)
  • అరుణ్ రాధాకృష్ణన్    (Cinematography)
  • ప్రదీప్ ఈ రాఘవ్ (Editor)
  • Release Date : మే 28 2026
  • ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ (Banner)

యాక్షన్ కింగ్ అర్జున్ అలియాస్ అర్జున్ సర్జా చాలా ఏళ్ళ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone). ఈ వారం చాలా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్య దేవర నాగవంశీ రిలీజ్ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి కలిగింది. రెగ్యులర్ సినిమా లవర్స్ కి ఈ వారం ఫస్ట్ ఆప్షన్ అంటే ఇదే. మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా అనేది తెలుసుకుందాం రండి :

Blast Zone Movie Review

కథ : రాజారాం (అర్జున్ సర్జా) ఒక కరాటే మాస్టర్. తన భార్య నీలవేణి (అభిరామి) కూతురు నీల (ప్రీతీ ముకుందన్)లతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. రాజారాం చెల్లెలి విషయంలో ఓ ఘోరం జరుగుతుంది. దాని వల్ల ఆమె ప్రాణాలు కోల్పోతుంది. తన చెల్లెలి విషయంలో జరిగింది… భవిష్యత్తులో తన కూతురు విషయంలో జరగకూడదు అని భావించి చిన్నప్పటి నుండీ నీలకి కరాటేలో శిక్షణ ఇస్తాడు రాజారాం.ఒకరోజు కొంతమంది రౌడీలు అన్యాయంగా ఒక కుర్రాడిని కొడుతుంటే… అది చూసిన రాజారాం ఎదురెళ్లి ఆ రౌడీలను చితకబాది, ఆ కుర్రాడిని కాపాడతాడు. అది చూసి అతని కూతురు నీల ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత ‘మనకు ఏ సంబంధం లేకపోయినా ఆ రౌడీలను కొట్టి, ఆ కుర్రాడిని ఎందుకు కాపాడావు నాన్న?’ అని తండ్రిని ప్రశ్నిస్తుంది.దానికి రాజారాం… ‘అన్యాయం మనవాళ్లకు జరిగినా, ఎదుటివాళ్లకు జరిగినా అండగా నిలబడాలి.

అలా సమస్యను ఎదిరించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది’ అని నీలకు వివరిస్తాడు.తండ్రి చెప్పిన ఆ మాటను నీల చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. అప్పటి నుండి తన కళ్లముందు ఎలాంటి తప్పు జరిగినా సహించకుండా, అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ చితక్కొడుతుంటుంది.ఈ క్రమంలో ఒకసారి తమ మెడికల్ షాప్ కి వచ్చిన కృపాకర్ (పవన్ కృష్ణ) అనే రౌడీషీటర్ మనిషిని నీల చితకబాది పోలీసులకు అప్పగిస్తుంది. అయితే, ఆమె చేసిన ఈ పని వల్ల వరుణ్ దయాళ్ (జాన్ కొక్కెన్) అతని అనుచరుడు అబ్రహం(అర్జున్ చిదంబరం)..లకి సంబంధించిన అక్రమ బిజినెస్‌లు రిస్క్‌లో పడతాయి. దాంతో పగ పెంచుకున్న ఆ నేరగాళ్లు నీలను, ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి స్కెచ్ వేస్తారు. ఈ సమస్య నుండి నీల ఎలా బయటపడింది? విలన్స్ బారి నుండి తన కూతురిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి తండ్రి రాజారాం ఏం చేశాడు? అనేదే మిగిలిన కథ.

Blast Zone Movie Review

నటీనటుల పనితీరు : చాలా కాలం తర్వాత అర్జున్ సర్జాకి ఒక మంచి సినిమా పడింది. సాధారణంగా యాక్షన్ సీన్స్ విషయంలో అర్జున్‌కి ఒక సెపరేట్ గ్రేస్ ఉంటుంది. అయితే, కొన్నాళ్ళుగా ఆయన చేసిన సినిమాల్లో ఆ మ్యాజిక్ కాస్త మిస్ అవుతూ వచ్చింది. కానీ, దర్శకుడు ఈ సినిమాలో ఆ యాక్షన్ గ్రేస్‌ను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నాడు. యాక్షనే కాకుండా, ఒక సగటు మధ్యతరగతి తండ్రి పాత్రలో కూడా అర్జున్ ఒదిగిపోయాడు అని చెప్పాలి. ఎమోషనల్ గా కూడా ఈ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.ఇక భార్య పాత్ర పోషించిన అభిరామి ఈ సినిమాలో మరింత స్లిమ్ గా కనిపిస్తూనే, యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టేసింది. కూతురి పాత్రలో ప్రీతీ ముకుందన్ చక్కగా సెట్ అయ్యింది. అబ్రహం పాత్ర పోషించిన అర్జున్ చిదంబరం స్క్రీన్ మీద చాలా క్రూయల్‌గా కనిపించి మెప్పించాడు.మెయిన్ విలన్ అయిన జాన్ కొక్కెన్ పాత్రను.. రెగ్యులర్ మాస్ సినిమాల్లోలా కేవలం సూటు బూటు వేయించి, ఫోన్లో మాట్లాడటానికే పరిమితం చేయడం కొంత డిజప్పాయింట్ చేస్తుంది. సెకండ్ విలన్‌గా నటించిన పవన్ కృష్ణ పాత్ర సెకండాఫ్‌లో కొన్ని చోట్ల నవ్విస్తుంది. అలా అని అనవసరమైన కామెడీ ట్రాక్..లు ఏమీ ఉండవు. కథలో భాగంగానే ఆ పాత్రతో ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు.మిగతా నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు.

Blast Zone Movie Review

 సాంకేతిక నిపుణుల పనితీరు : ‘బ్లాస్ట్ జోన్’ సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్లోనే చెప్పేసి ఆడియన్స్ ని ప్రిపేర్ చేశాడు దర్శకుడు సుభాష్ కె రాజ్. ‘ఇంతకు మించి సినిమాలో కొత్తగా ఏముంటుందిలే’ అని చాలా మంది ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ సీన్ నుండి తన స్క్రీన్ ప్లేతో కట్టి పడేశాడు దర్శకుడు సుభాష్. కొన్ని చోట్ల నెల్సన్ తెరకెక్కించిన ‘జైలర్’, లోకేష్ కనగరాజ్ సినిమాల ఫ్లేవర్స్, అలాగే లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ కలగొచ్చు. ఎందుకంటే ప్రతి పాత్రకి డీటెయిలింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అనుకోవాలి. ఉదాహరణకి టోబి అనే చెయిన్ స్నాచర్ పాత్ర బ్యాక్ స్టోరీ కూడా చూపించాల్సిన అవసరం లేదు.

కానీ ఎందుకో దర్శకుడు ఆ ట్రాక్ కూడా పెట్టాడు. అవి పక్కన పెట్టేస్తే..మెడికల్ షాప్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం బాగా పేలింది. ఆ సీన్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సెకండాఫ్ లో విలన్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడా కూడా హెవీ అనే ఫీలింగ్ కలిగించవు. రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు అతను లౌడ్ మ్యూజిక్ మాత్రమే ఇవ్వగలడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకి అతను ఇచ్చిన ఔట్పుట్ కొత్తగా ఉంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకులను కూడా వెంటాడుతుంది బీజీఎం అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగా సెట్ అయ్యింది.

Blast Zone Movie Review

విశ్లేషణ : కొంత వయొలెన్స్ పార్ట్ మినహాయిస్తే..  ‘బ్లాస్ట్ జోన్’ ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి థియేటర్ కి వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా.

ఫోకస్ : సూపర్ బ్లాస్ట్

రేటింగ్ : 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Abhirami
  • #arjun sarja
  • #Blast Zone

Reviews

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

7 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

8 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

4 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

5 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

5 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

8 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version