పాపం ఆ డైరెక్టర్.. హాస్పిటల్ పాలయ్యాడు..!

2019 లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గతేడాది అక్షయ్ కుమార్ తో ‘మిషన్ మంగళ్’ చిత్రాన్ని తెరకెక్కిన జగన్ శక్తి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడట. ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి ముంబయిలో పార్టీ చేసుకుంటుంటుండగా.. ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాడట. దీంతో వెంటనే అతన్ని హాస్పిటల్ లో చేర్చారట ఆయన స్నేహితులు. అతని బ్రెయిన్ లో బ్లడ్ క్లోస్ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తుంది.

జగన్ డైరెక్ట్ చేసిన ‘మిషన్ మంగళ్’ చిత్రం 200 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ చిత్రం పూర్తిగా ఫిమేల్ ఓరియెంటెడ్ అయినప్పటికీ.. హీరో అక్షయ్ ను దర్శకుఢు జగన్ ప్రెజెంట్ చేసిన తీరుకి అందరూ మెచ్చుకున్నారు. ఇక హీరో అక్షయ్ కూడా జగన్ కు మరో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో ‘ఖైదీ నెంబర్ 150’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యాలని అక్షయ్ భావించి.. దీనికి జగన్ ను దర్శకత్వం వహించాలని కోరాడట. ఈ రీమేక్ కు ‘ఇక్కి’ అనే పేరుని ఖరారు చేసి మరీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా జగన్ పరిస్థితి.. ఇలా అయ్యింది. అసలు దీని వెనుక కారణమేంటనేది తెలియాల్సి ఉంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus