Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

బాబీ డియోల్ పరిచయం అవసరం లేని పేరు. ‘యానిమల్’ అనే ఒకే ఒక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. సౌత్‌ నుంచి నార్త్ వరకు ఇతని రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఒకప్పుడు బాలీవుడ్ హీరో. మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. కానీ ‘యానిమల్’ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఈ నటుడి క్రేజ్ పాన్-ఇండియా లెవెల్‌కు దూసుకెళ్లింది.’యానిమల్’ సక్సెస్ తర్వాత బాబీ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ‘డాకు మహారాజ్’ ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమాలతో బిజీ అయిపోయారు.

Bobby Deol Wife Tanya Deol

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో తన ఫ్యామిలీతో కలిసి మెరిశాడు. అయితే, అందరి కెమెరా కళ్లు బాబీ కన్నా ఎక్కువగా అతని భార్య తాన్యా డియోల్ పైనే ఫోకస్ అయ్యాయి. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో కనిపించిన తాన్యా, తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘ఈమె ముందు స్టార్ హీరోయిన్లు కూడా తేలిపోయారుగా’, “రియల్ బ్యూటీ” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాన్యా అందం గురించే కాదు, ఆమె తనకు ఇచ్చిన సపోర్ట్ గురించి కూడా బాబీ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. “నా కెరీర్ పూర్తిగా డల్ అయిపోయినప్పుడు, నన్ను ఎవరూ పట్టించుకోని సమయంలో, ప్రపంచం నన్ను పక్కన పెట్టినప్పుడు కూడా తాన్యా నన్ను వదిలి పెట్టలేదు” అని గుర్తుచేసుకున్నాడు.”‘నువ్వొక అద్భుతమైన నటుడివి, నీ టైమ్ వస్తుంది’ అని రోజూ నాకు ధైర్యం చెప్పేది.

నా మీద నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఈ రోజు నా ఈ సక్సెస్‌కు కారణం ఆమెనే” అంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు.1996 మే 30న తాన్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాబీ డియోల్. ఇన్నేళ్ల వాళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, నేటి తరం కపుల్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

 

పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus