సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా దూసుకుపోతున్న ఒకప్పటి బాలీవుడ్ హీరో బాబి డియోల్ (Bobby Deol) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బాగానే హైలెట్ అవుతున్నాడు. బాలీవుడ్‌లో యానిమల్ (Animal) విజయం తర్వాత దక్షిణాది సినిమాల్లో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు లో (Hari Hara Veera Mallu) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. బాబి డియోల్ పాత్రపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఇటీవల బాబి డియోల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు. “ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. హరిహర వీరమల్లు స్క్రిప్ట్ వినగానే నాకు ఇదొక స్పెషల్ సినిమా అని అనిపించింది. పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథకు ఓకే చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ సరసన నేను చేస్తున్న మొదటి సినిమా కావడం గర్వంగా ఉంది” అని తెలిపారు.
బాబి డియోల్ పాత్ర గురించి వచ్చిన మరిన్ని.లీక్స్ ప్రకారం అతని క్యారెక్టర్ అతి భయంకరంగా ఉంటుందట. ఇంట్రడక్షన్ సీన్స్ తోనే వణుకు పుట్టించేలా కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయని టాక్. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) ద్వారా డిజైన్ చేసిక బాబీ సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, మేకర్స్ ఈ క్యారెక్టర్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం.
పవన్ కళ్యాణ్ గెటప్ ఎంత విశేషంగా ఉంటుందో, బాబి డియోల్ పాత్ర కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉండబోతుందట. ప్రతి పీరియాడిక్ డ్రామాలో ప్రతినాయకుడు ఒక కీలకమైన పాత్ర పోషిస్తాడు. అందులో బాబి డియోల్ లాంటి నటుడి ప్రిజెన్స్ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాక, బాబి ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని డిటైల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఈ కథలో పాత్రలు చాలా బలంగా డిజైన్ చేయబడ్డాయి. పాత్రలకి సంబంధించిన మిస్టరీ నేపథ్యాలు కూడా ఉండడంతో కథకు అద్భుతమైన ఎమోషనల్ డెప్త్ కలిగిందట. ఇది సినిమా విజయంలో కీలకమైన అంశంగా మారుతుందని బాబి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానున్న హరిహర వీరమల్లు గురించి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి సినిమా (Hari Hara Veera Mallu) విడుదల అనంతరం అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.