30 ఏళ్ల క్రితం చెప్పా… ఇప్పుడూ అదే చెబుతా

  • March 13, 2021 / 01:25 PM IST

సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. 30 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. ‘మోసగాళ్లు’సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోగా పేరు పొందిన సునీల్ శెట్టి.. గత కొన్నేళ్లుగా అతిథి పాత్రలు, కీలక పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చారు. ఇప్పుడు చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. మరి అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు కదా. రెండింటికీ తేడాలేంటి అని ప్రశ్న అడగకుండా ఉంటామా. అందుకే ఈ మధ్య ఆయన దగ్గర మీడియా ఈ ప్రశ్న వేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

‘‘దక్షిణాది చిత్రపరిశ్రమలో క్రమశిక్షణ ఎక్కువ. 30 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పాను.. ఇప్పుడూ అదే చెబుతున్నా. బాలీవుడ్‌లోనూ దీన్ని పాటిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడి కథల్లో కొత్తదనం కనిపిస్తుంది. హిందీ చిత్రపరిశ్రమ కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఐదు రెట్లు బెటర్‌. ఇక్కడి అభిమానులు చాలా విశ్వాసపాత్రులు. వాళ్లకు సినిమా అంటే పిచ్చి.. ఇంకా చెప్పాలంటే అంత కంటే ఎక్కువే’’ అంటూ టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల గురించి, ఇక్కడి అభిమానుల గురించి చెప్పుకొచ్చాడు సునీల్‌ శెట్టి.

‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో టాలెంట్‌ ఎగుమతి, దిగుమతి బాగా జరుగుతోంది. బాలీవుడ్‌లో కిఇటీవల చాలామంది తెలుగు నటీనటులు వస్తున్నారు. నేను హైదరాబాద్‌లో 30 ఏళ్ల నుండి ఏదో సినిమాకు పని చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసి ఏ బాలీవుడ్‌ యాక్టర్‌ కూడా ఇంతగా ఇక్కడ నటించలేదు. ఇక్కడి వర్క్‌ కల్చర్‌ అంతగా నాకు నచ్చుతుంది. వేలాదిమంది తమ అభిమాన నటీనటుల్ని చూడటానికి వస్తుంటారు. కానీ ఎప్పుడూ ఎవరినీ డిస్ట్రబ్‌ చేయరు’’ అని అభిమానులను ఆకాశానికి ఎత్తేశాడు సునీల్‌ శెట్టి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus