RRR Trailer: ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ కోరిక తీరుతుందా?

  • December 10, 2021 / 04:49 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తెలుగు ట్రైలర్ కు 21 మిలియన్ల వ్యూస్ రాగా హిందీ ట్రైలర్ కు కూడా 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జెండా పాతేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటాలనే ఈ ఇద్దరు హీరోల కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ చెప్పిన డైలాగ్స్ బాలీవుడ్ హీరోలు చెప్పినట్టుగానే ఉన్నాయని నార్త్ ఇండియన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేయడం గమనార్హం. ట్రైలర్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే షాట్స్ ఎక్కువగానే ఉన్నాయి.

రాజమౌళి ట్రైలర్ లో రివీల్ చేయని సర్ప్రైజ్ లు సినిమాలో చాలానే ఉన్నాయని తెలుస్తోంది. భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదని ఎన్టీఆర్, చరణ్ అభిమానులు భావిస్తున్నారు. జంజీర్ సినిమాతో చరణ్ కు బాలీవుడ్ లో చేదు అనుభవం ఎదురు కాగా ఆర్ఆర్ఆర్ తో గతంలో ఎదురైన విమర్శలకు చరణ్ ధీటుగా బదులిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus